80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ఖమ్మం నగరంలో చిన్నారులు ఉత్సాహంగా స్కేటింగ్ ర్యాలీ నిర్వహించారు. సర్దార్ పటేల్ స్టేడియం నుంచి ట్యాంక్ బండ్ వరకు ర్యాలీ కొనసాగింది. స్కేట్లపై జాతీయ జెండాలను చేతబూని చిన్నారులు దేశభక్తిని చాటుతూ సందడి చేశారు. దేశభక్తి నినాదాలతో ర్యాలీ మార్మోగింది. చిన్నారుల ఉత్సాహాన్ని చూసేందుకు తల్లిదండ్రులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రోత్సహించారు. స్వాతంత్ర్య దినోత్సవ స్ఫూర్తిని చాటుతూ నిర్వహించిన ఈ ర్యాలీ నగర ప్రజలను ఆకట్టుకుంది.



