Tuesday, 1 September 2026
  • Home  
  • రెబ్బెన తహసీల్దార్ కార్యాలయంలో విస్తుపోయే నిజాలు!?
- ASIFABAD

రెబ్బెన తహసీల్దార్ కార్యాలయంలో విస్తుపోయే నిజాలు!?

2019 జూన్ హాజరు రిజిస్టర్లో డిప్యూటీ తహసీల్దార్ సంతకం గైర్హాజరు.. ఆర్టీఐ ద్వారా బట్టబయలైన బాగోతం.. నమగ్ర విచారణకు ప్రజల డిమాండ్ ఆర్టీఐతో వెలుగులోకి విస్తుపోయే నిజాలు సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) ఎంతటి శక్తివంతమైనదో ఈ ఉదంతం మరోసారి నిరూపించింది. రెబ్బెన మండలం అగస్టు 20,పున్నమి ప్రతినిది:కొమురంభీం అసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండల తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన ఒక విచిత్రమైన, అదే సమయంలో విస్తుగొలుపుతున్న వ్యవహారం ప్రస్తుతం రెవెన్యూ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతిరోజూ కార్యాలయానికి హాజరుకావడం, రిజిస్టర్లో నంతకం చేయడం ప్రాథమిక నిబంధన. కానీ, ఓ డిప్యూటీ తహసీల్దార్ ఏకంగా ఒక నెల పాటు హాజరు రిజిస్టర్ సంతకమే చేయకుండా విధులు నిర్వహించినట్లు వస్తున్న వార్తలు ఇప్పుడు అంతులేని చర్చకు దారితీశాయి. అసలు రెబ్బెన తహసీల్దార్ కార్యాలయంలో ఏం జరుగుతోంది? నిబంధనలను గాలికొదిలేని ప్రజల సొమ్మును ఎలా దోచుకుంటున్నారు? అనే కోణంలో స్థానికంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కార్యాలయంలో 2019 జూన్ నెలలో జరిగిన పరిపాలనా తీరుపై ఓ బాధ్యత గల పౌరుడు ఆర్టీఐ ద్వారా దరఖాస్తు చేసి వివరాలు కోరగా. విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. ఆ కాలంలో మండలంలో విధులు నిర్వర్తించాల్సిన సదరు డిప్యూటీ తహసీల్దార్ హాజరు రిజిస్టర్ ఎక్కడా కనీసం ఒక్క సంతకం కూడా చేయలేదని మరియు 2019 25న 9 మంది రైతుల మీద కూడ కేసు వేశారు ఈ వ్యవహారం పై రెబ్బెన సిఐ కి పిర్యాదు చేసిన స్పందన లేదు అని ఆ సమాచారంలో స్పష్టమైంది. అసలు ఆ డిప్యూటీ తహసీల్దార్ ఆ సమయంలో కార్యాలయానికి వచ్చారా? లేదా? ఒకవేళ రాకపోతే ఆయన గైర్హాజరును ఎందుకు గోప్యంగా ఉంచారు? అనే దానిపై ప్రజల్లో తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సంతకం లేకుండానే జీతభత్యాల చెల్లింపులపై సందేహాలు: ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులు క్రమం తప్పకుండా హాజరు నమోదు చేసుకోవడం, ఆ రిజిస్టర్ ఆధారంగానే నెలవారీ జీతాలు, ఇతర అలవెన్సులు విడుదల కావడం సాధారణ నిబంధన, మరి, హాజరు రిజిస్టర్ కనీన సంతకం కూడా చేయని నదరు డిప్యూటీ తహసీల్దార్ కి ఆ నెలకు సంబంధించిన జీతం ఎలా చెల్లించారు? నంతకం లేని పత్రాలకు ఆమోదం తెలిపి. జీతం పొందడం వెనుక ఎవరి హస్తం ఉంది? ఇది కేవలం క్లర్క్ స్థాయి అజాగ్రత్తా లేక ఉన్నతాధికారుల అండతో జరిగిన మరో పెద్ద అవకతవకా అనే ప్రశ్నలకు రెవెన్యూ శాఖ సమాధానం చెప్పాల్సి ఉంది. నిబంధనలను తుంగలో తొక్కి ప్రజాధనాన్ని కొల్లగొడుతున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. సమగ్ర విచారణకు తీవ్ర డిమాండ్: ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చిన తర్వాత స్థానికులు, ప్రజా సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. 2019 జూన్ నెలకు సంబంధించిన హాజరు రిజిస్టర్తో పాటు, ఆ సమయంలో కార్యాలయానికి డిప్యూటీ తహసీల్దార్ హాజరైనట్లు రుజువు చేసే మూవ్మెంట్ రిజిన్లర్లు, జీతాల బిల్లులు, ఇతర అధికారిక రికార్డులపై సమగ్రమైన ఉన్నత స్థాయి విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు. కేవలం నామమాత్రపు విచారణతో కాలయావన చేయకుండా, ఈ అక్రమానికి బాధ్యులైన వారిపై శాఖాపరమైన మరియు చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.ప్రభుత్వ ఉద్యోగులు ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన బాధ్యతను మరిచి ఇలా వ్యవహరించడం వ్యవస్థపై ప్రజల నమ్మకాన్ని నడలిస్తోంది. ఆర్టీఐ ద్వారా బయటపడిన ఈ బాగోతంపై రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారు? నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించిన వారిపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోబోతున్నారు అనేది ఇప్పుడు తీవ్ర ఆనక్తికరంగా మారింది. బాధ్యులపై తక్షణమే చర్యలు తీసుకోకపోతే ఆందోళనలు ఉదృతం చేస్తామని ప్రజలు హెచ్చరిస్తున్నారు.

2019 జూన్ హాజరు రిజిస్టర్లో డిప్యూటీ తహసీల్దార్ సంతకం గైర్హాజరు.. ఆర్టీఐ ద్వారా బట్టబయలైన బాగోతం.. నమగ్ర విచారణకు ప్రజల డిమాండ్
ఆర్టీఐతో వెలుగులోకి విస్తుపోయే నిజాలు
సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) ఎంతటి శక్తివంతమైనదో ఈ ఉదంతం మరోసారి నిరూపించింది.

రెబ్బెన మండలం అగస్టు 20,పున్నమి ప్రతినిది:కొమురంభీం అసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండల తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన ఒక విచిత్రమైన, అదే సమయంలో విస్తుగొలుపుతున్న వ్యవహారం ప్రస్తుతం రెవెన్యూ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతిరోజూ కార్యాలయానికి హాజరుకావడం, రిజిస్టర్లో నంతకం చేయడం ప్రాథమిక నిబంధన. కానీ, ఓ డిప్యూటీ తహసీల్దార్ ఏకంగా ఒక నెల పాటు హాజరు రిజిస్టర్ సంతకమే చేయకుండా విధులు నిర్వహించినట్లు వస్తున్న వార్తలు ఇప్పుడు అంతులేని చర్చకు దారితీశాయి. అసలు రెబ్బెన తహసీల్దార్ కార్యాలయంలో ఏం జరుగుతోంది? నిబంధనలను గాలికొదిలేని ప్రజల సొమ్మును ఎలా దోచుకుంటున్నారు? అనే కోణంలో స్థానికంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

కార్యాలయంలో 2019 జూన్ నెలలో జరిగిన పరిపాలనా తీరుపై ఓ బాధ్యత గల పౌరుడు ఆర్టీఐ ద్వారా దరఖాస్తు చేసి వివరాలు కోరగా. విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. ఆ కాలంలో మండలంలో విధులు నిర్వర్తించాల్సిన సదరు డిప్యూటీ తహసీల్దార్ హాజరు రిజిస్టర్ ఎక్కడా కనీసం ఒక్క సంతకం కూడా చేయలేదని మరియు 2019 25న 9 మంది రైతుల మీద కూడ కేసు వేశారు ఈ వ్యవహారం పై రెబ్బెన సిఐ కి పిర్యాదు చేసిన స్పందన లేదు అని ఆ సమాచారంలో స్పష్టమైంది. అసలు ఆ డిప్యూటీ తహసీల్దార్ ఆ సమయంలో కార్యాలయానికి వచ్చారా? లేదా? ఒకవేళ రాకపోతే ఆయన గైర్హాజరును ఎందుకు గోప్యంగా ఉంచారు? అనే దానిపై ప్రజల్లో తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

సంతకం లేకుండానే జీతభత్యాల చెల్లింపులపై సందేహాలు:

ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులు క్రమం తప్పకుండా హాజరు నమోదు చేసుకోవడం, ఆ రిజిస్టర్ ఆధారంగానే నెలవారీ జీతాలు, ఇతర అలవెన్సులు విడుదల కావడం సాధారణ నిబంధన, మరి, హాజరు రిజిస్టర్ కనీన సంతకం కూడా చేయని నదరు డిప్యూటీ తహసీల్దార్ కి ఆ నెలకు సంబంధించిన జీతం ఎలా చెల్లించారు? నంతకం లేని పత్రాలకు ఆమోదం తెలిపి. జీతం పొందడం వెనుక ఎవరి హస్తం ఉంది? ఇది కేవలం క్లర్క్ స్థాయి అజాగ్రత్తా లేక ఉన్నతాధికారుల అండతో జరిగిన మరో పెద్ద అవకతవకా అనే ప్రశ్నలకు రెవెన్యూ శాఖ సమాధానం చెప్పాల్సి ఉంది. నిబంధనలను తుంగలో తొక్కి ప్రజాధనాన్ని కొల్లగొడుతున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.

సమగ్ర విచారణకు తీవ్ర డిమాండ్:

ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చిన తర్వాత స్థానికులు, ప్రజా సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. 2019 జూన్ నెలకు సంబంధించిన హాజరు రిజిస్టర్తో పాటు, ఆ సమయంలో కార్యాలయానికి డిప్యూటీ తహసీల్దార్ హాజరైనట్లు రుజువు చేసే మూవ్మెంట్ రిజిన్లర్లు, జీతాల బిల్లులు, ఇతర అధికారిక రికార్డులపై సమగ్రమైన ఉన్నత స్థాయి విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు. కేవలం నామమాత్రపు విచారణతో కాలయావన చేయకుండా, ఈ అక్రమానికి బాధ్యులైన వారిపై శాఖాపరమైన మరియు చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.ప్రభుత్వ ఉద్యోగులు ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన బాధ్యతను మరిచి ఇలా వ్యవహరించడం వ్యవస్థపై ప్రజల నమ్మకాన్ని నడలిస్తోంది. ఆర్టీఐ ద్వారా బయటపడిన ఈ బాగోతంపై రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారు? నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించిన వారిపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోబోతున్నారు అనేది ఇప్పుడు తీవ్ర ఆనక్తికరంగా మారింది. బాధ్యులపై తక్షణమే చర్యలు తీసుకోకపోతే ఆందోళనలు ఉదృతం చేస్తామని ప్రజలు హెచ్చరిస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.