Tuesday, 1 September 2026
  • Home  
  • రాహుల్ గాంధీపై అక్రమ FIRను వెంటనే ఉపసంహరించాలి బీజేపీ–ఆర్‌ఎస్‌ఎస్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి కడపలో కాంగ్రెస్ శ్రేణుల భారీ నిరసన ర్యాలీ
- కడప

రాహుల్ గాంధీపై అక్రమ FIRను వెంటనే ఉపసంహరించాలి బీజేపీ–ఆర్‌ఎస్‌ఎస్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి కడపలో కాంగ్రెస్ శ్రేణుల భారీ నిరసన ర్యాలీ

రాహుల్ గాంధీపై అక్రమ FIRను వెంటనే ఉపసంహరించాలి బీజేపీ–ఆర్‌ఎస్‌ఎస్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి కడపలో కాంగ్రెస్ శ్రేణుల భారీ నిరసన ర్యాలీ పున్నమి ప్రతినిధి | కడప, సెప్టెంబర్ 1, 2026: అఖిల భారత కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు కడప సిటీ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో నగర అధ్యక్షులు సయ్యద్ గౌస్ పీర్ నాయకత్వంలో మంగళవారం మహావీర్ సర్కిల్ నుంచి కడప కలెక్టరేట్ కార్యాలయం వరకు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత శ్రీ రాహుల్ గాంధీపై ఉత్తరాఖండ్ పోలీసులు నమోదు చేసిన FIRను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. “రాహుల్ గాంధీపై FIRను వెంటనే ఉపసంహరించాలి”, “బీజేపీ–ఆర్‌ఎస్‌ఎస్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి”, “ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి”, “కాంగ్రెస్ పార్టీ జిందాబాద్”, “రాహుల్ గాంధీ జిందాబాద్” అంటూ నినాదాలు చేస్తూ కాంగ్రెస్ శ్రేణులు కలెక్టరేట్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా కడప సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు సయ్యద్ గౌస్ పీర్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ మల్లికార్జున ఖర్గేను అవమానిస్తూ ఉత్తరాఖండ్‌లో ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ నాయకులు శుద్ధి కార్యక్రమం నిర్వహించడం అత్యంత దుర్మార్గమైన చర్య అని అన్నారు. ఈ ఘటనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేయాలని రాహుల్ గాంధీ ఉత్తరాఖండ్ పోలీసులను కోరినందుకు ప్రతీకారంగా, ఎన్డీఏ ప్రభుత్వం రాజకీయ కక్షసాధింపులో భాగంగా ఉత్తరాఖండ్ పోలీసులతో రాహుల్ గాంధీపై FIR నమోదు చేయించడం తీవ్రంగా ఖండించదగిన విషయమని పేర్కొన్నారు. ప్రతిపక్ష నాయకుడిపై రాజకీయ కక్షతో కేసులు నమోదు చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని, ఇలాంటి బెదిరింపులకు, అక్రమ కేసులకు కాంగ్రెస్ పార్టీ భయపడదని సయ్యద్ గౌస్ పీర్ స్పష్టం చేశారు. దేశంలో రాజ్యాంగం, సామాజిక న్యాయం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం రాహుల్ గాంధీ నిరంతరం పోరాడుతున్నారని, ఆయనపై నమోదు చేసిన కేసును తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే రాబోయే ఎన్నికల్లో బీజేపీకి, బీజేపీ విధానాలకు మద్దతు ఇస్తున్న టీడీపీ, జనసేన, వైఎస్సార్‌సీపీ పార్టీలకు ప్రజలు తమ ఓటు ద్వారా తగిన బుద్ధి చెప్పాలని సయ్యద్ గౌస్ పీర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కడప సిటీ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు అంజన్ కుమార్, సౌదాగర్ సాదిక్, ఫజరుల్లా, జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు వెంకట సుబ్బయ్య, డివిజన్ ఇన్చార్జులు మహబూబ్ బాషా, ముబారక్ భాషా, సిద్ధిక్, షేక్ అన్వర్, సయ్యద్ అన్వర్, హాజీ భాయ్, మురాద్ భాష, సాదిక్, ఆరిఫ్, జమీల్, గంగయ్య, సుబ్రహ్మణ్యం, గఫార్, అక్రమ్, అమీదా ఖానం తదితరులతో పాటు యువజన కాంగ్రెస్, NSUI, మహిళా కాంగ్రెస్, కాంగ్రెస్ అనుబంధ విభాగాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

రాహుల్ గాంధీపై అక్రమ FIRను వెంటనే ఉపసంహరించాలి

బీజేపీ–ఆర్‌ఎస్‌ఎస్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి

కడపలో కాంగ్రెస్ శ్రేణుల భారీ నిరసన ర్యాలీ

పున్నమి ప్రతినిధి | కడప, సెప్టెంబర్ 1, 2026:

అఖిల భారత కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు కడప సిటీ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో నగర అధ్యక్షులు సయ్యద్ గౌస్ పీర్ నాయకత్వంలో మంగళవారం మహావీర్ సర్కిల్ నుంచి కడప కలెక్టరేట్ కార్యాలయం వరకు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత శ్రీ రాహుల్ గాంధీపై ఉత్తరాఖండ్ పోలీసులు నమోదు చేసిన FIRను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

“రాహుల్ గాంధీపై FIRను వెంటనే ఉపసంహరించాలి”, “బీజేపీ–ఆర్‌ఎస్‌ఎస్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి”, “ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి”, “కాంగ్రెస్ పార్టీ జిందాబాద్”, “రాహుల్ గాంధీ జిందాబాద్” అంటూ నినాదాలు చేస్తూ కాంగ్రెస్ శ్రేణులు కలెక్టరేట్‌కు చేరుకున్నారు.

ఈ సందర్భంగా కడప సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు సయ్యద్ గౌస్ పీర్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ మల్లికార్జున ఖర్గేను అవమానిస్తూ ఉత్తరాఖండ్‌లో ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ నాయకులు శుద్ధి కార్యక్రమం నిర్వహించడం అత్యంత దుర్మార్గమైన చర్య అని అన్నారు.

ఈ ఘటనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేయాలని రాహుల్ గాంధీ ఉత్తరాఖండ్ పోలీసులను కోరినందుకు ప్రతీకారంగా, ఎన్డీఏ ప్రభుత్వం రాజకీయ కక్షసాధింపులో భాగంగా ఉత్తరాఖండ్ పోలీసులతో రాహుల్ గాంధీపై FIR నమోదు చేయించడం తీవ్రంగా ఖండించదగిన విషయమని పేర్కొన్నారు.

ప్రతిపక్ష నాయకుడిపై రాజకీయ కక్షతో కేసులు నమోదు చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని, ఇలాంటి బెదిరింపులకు, అక్రమ కేసులకు కాంగ్రెస్ పార్టీ భయపడదని సయ్యద్ గౌస్ పీర్ స్పష్టం చేశారు. దేశంలో రాజ్యాంగం, సామాజిక న్యాయం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం రాహుల్ గాంధీ నిరంతరం పోరాడుతున్నారని, ఆయనపై నమోదు చేసిన కేసును తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

అలాగే రాబోయే ఎన్నికల్లో బీజేపీకి, బీజేపీ విధానాలకు మద్దతు ఇస్తున్న టీడీపీ, జనసేన, వైఎస్సార్‌సీపీ పార్టీలకు ప్రజలు తమ ఓటు ద్వారా తగిన బుద్ధి చెప్పాలని సయ్యద్ గౌస్ పీర్ పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో కడప సిటీ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు అంజన్ కుమార్, సౌదాగర్ సాదిక్, ఫజరుల్లా, జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు వెంకట సుబ్బయ్య, డివిజన్ ఇన్చార్జులు మహబూబ్ బాషా, ముబారక్ భాషా, సిద్ధిక్, షేక్ అన్వర్, సయ్యద్ అన్వర్, హాజీ భాయ్, మురాద్ భాష, సాదిక్, ఆరిఫ్, జమీల్, గంగయ్య, సుబ్రహ్మణ్యం, గఫార్, అక్రమ్, అమీదా ఖానం తదితరులతో పాటు యువజన కాంగ్రెస్, NSUI, మహిళా కాంగ్రెస్, కాంగ్రెస్ అనుబంధ విభాగాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.