Friday, 4 September 2026
  • Home  
  • మున్సిపాలిటీ ఆదాయం వనరులను పెంపొందించాలి :జిల్లా కలెక్టర్
- జనగాం

మున్సిపాలిటీ ఆదాయం వనరులను పెంపొందించాలి :జిల్లా కలెక్టర్

మున్సిపాలిటీ ఆదాయ వనరులను పెంపొందించాలి -జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ———————— జనగామ, ఆగష్టు 19,పున్నమి జిల్లా ప్రతినిధి : జనగామ మున్సిపాలిటీ సమగ్ర సమీక్ష సమావేశం లో జనగామ జిల్లా కలెక్టర్ మాడట్లాడుతూ, ప్రజలకు నాణ్యమైన పౌర సేవలు అందించాలి, వార్డుల వారీగా పారిశుద్ధ్య రూట్ మ్యాప్ రూపొందించి, ఆన్‌లైన్‌లో పొందుపరచాలి, పన్నుల వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించాలి, అనుమతి లేని నిర్మాణాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించొద్దు, నిబంధనలకు అనుగుణంగా భవన నిర్మాణాలు జరిగేలా పర్యవేక్షించాలి, లైసెన్సులు, ఇంటి నిర్మాణ అనుమతులు నిర్ణీత సమయంలో జారీ చేయాలి, వార్డుల వారీగా స్వచ్ఛ ఆటోలు, ట్రాక్టర్లను రూట్ల ప్రకారం కేటాయించాలి సిబ్బంది సమయపాలనతో, బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలి, సమష్టిగా మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేయాలి, ప్రజలు పన్నులు సకాలంలో చెల్లించి, మున్సిపాలిటీ అభివృద్ధికి సహకరించాలి, జనగామ మున్సిపాలిటీపై సమగ్ర సమీక్ష, జనగామ మున్సిపాలిటీ పరిధిలో ప్రజలకు మెరుగైన పౌర సేవలు అందించడంతో పాటు మున్సిపాలిటీ ఆదాయాన్ని పెంచేందుకు సమగ్ర కార్యాచరణ రూపొందించి, అమలు చేయాలని *జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా* మున్సిపల్ అధికారులను ఆదేశించారు. బుధవారం, జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో జనగామ మున్సిపాలిటీకి సంబంధించిన వివిధ విభాగాల పనితీరుపై మున్సిపల్ అధికారులతో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా* సమావేశం నిర్వహించి, సమగ్రంగా సమీక్షించారు. ఈ సందర్భంగా మున్సిపాలిటీలోని వివిధ విభాగాల వారీగా చేపడుతున్న కార్యక్రమాలు, ఆదాయ వనరులు, పన్నుల వసూళ్లు, పారిశుద్ధ్య నిర్వహణ, ఇంటి నిర్మాణ అనుమతులు, ట్రేడ్ లైసెన్సులు, జనన–మరణ ధ్రువీకరణ పత్రాల జారీ, సిబ్బంది విధుల నిర్వహణ, తదితర అంశాలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో *జిల్లా కలెక్టర్* మాట్లాడుతూ.. మున్సిపాలిటీకి ఉన్న ఆదాయ వనరులను పూర్తిస్థాయిలో వినియోగించుకోవడంతో పాటు కొత్త ఆదాయ వనరులను అన్వేషించాలని సూచించారు. ఇంటి పన్ను, నీటి పన్ను, ట్రేడ్ లైసెన్సులు, తదితర పన్నుల వసూళ్లలో మరింత పురోగతి సాధించాలని, బకాయిల వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. మున్సిపాలిటీ ఆర్థికంగా బలోపేతం అయ్యేలా పక్కా కార్యాచరణ రూపొందించాలన్నారు. జనగామ మున్సిపాలిటీ పరిధిలో పారిశుద్ధ్య నిర్వహణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని *కలెక్టర్* స్పష్టం చేశారు. పారిశుద్ధ్య పనులను పూర్తి స్థాయిలో మ్యాపింగ్ చేసి, వార్డుల వారీగా రూట్ మ్యాప్ రూపొందించి, మున్సిపాలిటీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచాలని సూచించారు. ఇళ్ల సంఖ్య, జనాభా నిష్పత్తికి అనుగుణంగా పారిశుద్ధ్య సిబ్బందిని కేటాయించి, వారి పనితీరును నిరంతరం పర్యవేక్షించాలన్నారు. వార్డుల వారీగా స్వచ్ఛ ఆటోలు, ట్రాక్టర్లను రూట్ల ప్రకారం కేటాయించి, చెత్త సేకరణలో ఎలాంటి అంతరాయం లేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. దుకాణాదారులు, వ్యాపార సంస్థల నిర్వాహకులు చెత్తను రోడ్లపై వేయకుండా చెత్తబుట్టల్లోనే వేయించేలా అవగాహన కల్పించాలని, పారిశుద్ధ్య నిబంధనలను ఉల్లంఘించే వారిపై నిబంధనల మేరకు చర్యలు తీసుకోవాలన్నారు. జనగామ పట్టణ స్వచ్ఛత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడరాదని అధికారులకు స్పష్టం చేశారు. మున్సిపాలిటీలో పనిచేస్తున్న ప్రతి ఉద్యోగి, సిబ్బంది సమయపాలన పాటిస్తూ, బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని *కలెక్టర్* సూచించారు. సిబ్బంది పనితీరు, బాధ్యతలు, వార్డుల వారీగా చేపట్టే కార్యకలాపాల పూర్తి ప్రక్రియను మ్యాపింగ్ చేసి, ఆన్‌లైన్‌లో పొందుపరచాలని ఆదేశించారు. వార్డు అధికారులకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా వినియోగించుకుని ప్రజలకు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది సమన్వయంతో సమష్టిగా, నిబద్ధతతో పనిచేస్తేనే మున్సిపాలిటీ అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. అర్హత కలిగిన జవాన్లకు అవసరమైన చోట శానిటరీ ఇన్‌స్పెక్టర్ల అదనపు బాధ్యతలు అప్పగించి, పారిశుద్ధ్య వ్యవస్థను మరింత పటిష్టం చేయాలని సూచించారు. ఇంటి నిర్మాణ అనుమతుల జారీ విషయంలో ప్రభుత్వ నిబంధనలను తూచా తప్పకుండా పాటించాలని కలెక్టర్ సూచించారు. నిర్ణీత గడువులోగా అర్హులైన దరఖాస్తుదారులకు అనుమతులు జారీ చేయాలని, నిబంధనలకు విరుద్ధంగా (లేదా) లోపాలు ఉన్న దరఖాస్తులను నిబంధనల ప్రకారం తిరస్కరించాలన్నారు. అనుమతి లేని నిర్మాణాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించరాదని, అనుమతులకు అనుగుణంగానే భవన నిర్మాణాలు చేపట్టేలా నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. నిబంధనలు పాటించని నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి సారించి, తగిన చర్యలు తీసుకోవాలన్నారు. జనన, మరణ ధ్రువీకరణ పత్రాల జారీలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండరాదని, ప్రజలకు అవసరమైన సేవలను నిర్ణీత సమయంలో అందించాలని సూచించారు. ట్రేడ్ లైసెన్సుల జారీ ప్రక్రియలో మరింత పురోగతి సాధించాలని, నిబంధనలకు అనుగుణంగా లైసెన్సులను జారీ చేయాలని ఆదేశించారు. మున్సిపాలిటీ పరిధిలోని ప్రకటనలపై వసూలు చేసే అడ్వర్టైజ్‌మెంట్ చార్జీలను నిబంధనల ప్రకారం పునఃసమీక్షించి, అవసరమైన మేరకు రీ-షెడ్యూల్ చేయాలని సూచించారు. టెండర్లు, రీ-టెండర్ల ప్రక్రియను వేగవంతం చేసి, నిబంధనల మేరకు చర్యలు చేపట్టాలన్నారు. మున్సిపాలిటీకి సంబంధించిన పూర్తి సమాచారాన్ని సమగ్రంగా సేకరించి, విభాగాల వారీగా వివరాలను మున్సిపల్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచాలని కలెక్టర్ సూచించారు. ప్రజలకు అవసరమైన సమాచారం సులభంగా అందేలా పారదర్శకతకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రజల భాగస్వామ్యం కూడా కీలకమని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రజలు తమ ఇంటి పన్ను, నీటి పన్ను, తదితర పన్నులను సకాలంలో చెల్లించి, మున్సిపాలిటీ అభివృద్ధికి తోడ్పాటునందించాలని కోరారు. ప్రజలకు నాణ్యమైన సేవలు అందించడమే లక్ష్యంగా అధికారులు, సిబ్బంది పని చేయాలని సూచించారు. ఈ సమీక్ష సమావేశంలో మున్సిపల్ ఛైర్పర్సన్ కడకంచి బాలమణి, మున్సిపల్ కమిషనర్ రాజశేఖర్ రెడ్డి, మున్సిపల్ శాఖ మేనేజర్ ప్రభాకర్, డీఈ రాజ్‌కుమార్, వార్డు అధికారులు, ఇంజనీరింగ్ అధికారులు, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు, బిల్ కలెక్టర్లు, ఇతర సంబంధిత అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

మున్సిపాలిటీ ఆదాయ వనరులను పెంపొందించాలి
-జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
————————
జనగామ, ఆగష్టు 19,పున్నమి జిల్లా ప్రతినిధి :
జనగామ మున్సిపాలిటీ సమగ్ర సమీక్ష సమావేశం లో
జనగామ జిల్లా కలెక్టర్ మాడట్లాడుతూ,
ప్రజలకు నాణ్యమైన పౌర సేవలు అందించాలి,
వార్డుల వారీగా పారిశుద్ధ్య రూట్ మ్యాప్ రూపొందించి, ఆన్‌లైన్‌లో పొందుపరచాలి,
పన్నుల వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించాలి,
అనుమతి లేని నిర్మాణాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించొద్దు,
నిబంధనలకు అనుగుణంగా భవన నిర్మాణాలు జరిగేలా పర్యవేక్షించాలి,
లైసెన్సులు, ఇంటి నిర్మాణ అనుమతులు నిర్ణీత సమయంలో జారీ చేయాలి,
వార్డుల వారీగా స్వచ్ఛ ఆటోలు, ట్రాక్టర్లను రూట్ల ప్రకారం కేటాయించాలి
సిబ్బంది సమయపాలనతో, బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలి,
సమష్టిగా మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేయాలి,
ప్రజలు పన్నులు సకాలంలో చెల్లించి, మున్సిపాలిటీ అభివృద్ధికి సహకరించాలి,
జనగామ మున్సిపాలిటీపై సమగ్ర సమీక్ష,
జనగామ మున్సిపాలిటీ పరిధిలో ప్రజలకు మెరుగైన పౌర సేవలు అందించడంతో పాటు మున్సిపాలిటీ ఆదాయాన్ని పెంచేందుకు సమగ్ర కార్యాచరణ రూపొందించి, అమలు చేయాలని *జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా* మున్సిపల్ అధికారులను ఆదేశించారు.
బుధవారం, జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో జనగామ మున్సిపాలిటీకి సంబంధించిన వివిధ విభాగాల పనితీరుపై మున్సిపల్ అధికారులతో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా* సమావేశం నిర్వహించి, సమగ్రంగా సమీక్షించారు.
ఈ సందర్భంగా మున్సిపాలిటీలోని వివిధ విభాగాల వారీగా చేపడుతున్న కార్యక్రమాలు, ఆదాయ వనరులు, పన్నుల వసూళ్లు, పారిశుద్ధ్య నిర్వహణ, ఇంటి నిర్మాణ అనుమతులు, ట్రేడ్ లైసెన్సులు, జనన–మరణ ధ్రువీకరణ పత్రాల జారీ, సిబ్బంది విధుల నిర్వహణ, తదితర అంశాలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఈ నేపథ్యంలో *జిల్లా కలెక్టర్* మాట్లాడుతూ.. మున్సిపాలిటీకి ఉన్న ఆదాయ వనరులను పూర్తిస్థాయిలో వినియోగించుకోవడంతో పాటు కొత్త ఆదాయ వనరులను అన్వేషించాలని సూచించారు. ఇంటి పన్ను, నీటి పన్ను, ట్రేడ్ లైసెన్సులు, తదితర పన్నుల వసూళ్లలో మరింత పురోగతి సాధించాలని, బకాయిల వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. మున్సిపాలిటీ ఆర్థికంగా బలోపేతం అయ్యేలా పక్కా కార్యాచరణ రూపొందించాలన్నారు.
జనగామ మున్సిపాలిటీ పరిధిలో పారిశుద్ధ్య నిర్వహణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని *కలెక్టర్* స్పష్టం చేశారు. పారిశుద్ధ్య పనులను పూర్తి స్థాయిలో మ్యాపింగ్ చేసి, వార్డుల వారీగా రూట్ మ్యాప్ రూపొందించి, మున్సిపాలిటీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచాలని సూచించారు. ఇళ్ల సంఖ్య, జనాభా నిష్పత్తికి అనుగుణంగా పారిశుద్ధ్య సిబ్బందిని కేటాయించి, వారి పనితీరును నిరంతరం పర్యవేక్షించాలన్నారు. వార్డుల వారీగా స్వచ్ఛ ఆటోలు, ట్రాక్టర్లను రూట్ల ప్రకారం కేటాయించి, చెత్త సేకరణలో ఎలాంటి అంతరాయం లేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
దుకాణాదారులు, వ్యాపార సంస్థల నిర్వాహకులు చెత్తను రోడ్లపై వేయకుండా చెత్తబుట్టల్లోనే వేయించేలా అవగాహన కల్పించాలని, పారిశుద్ధ్య నిబంధనలను ఉల్లంఘించే వారిపై నిబంధనల మేరకు చర్యలు తీసుకోవాలన్నారు. జనగామ పట్టణ స్వచ్ఛత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడరాదని అధికారులకు స్పష్టం చేశారు.
మున్సిపాలిటీలో పనిచేస్తున్న ప్రతి ఉద్యోగి, సిబ్బంది సమయపాలన పాటిస్తూ, బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని *కలెక్టర్* సూచించారు. సిబ్బంది పనితీరు, బాధ్యతలు, వార్డుల వారీగా చేపట్టే కార్యకలాపాల పూర్తి ప్రక్రియను మ్యాపింగ్ చేసి, ఆన్‌లైన్‌లో పొందుపరచాలని ఆదేశించారు. వార్డు అధికారులకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా వినియోగించుకుని ప్రజలకు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది సమన్వయంతో సమష్టిగా, నిబద్ధతతో పనిచేస్తేనే మున్సిపాలిటీ అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు.
అర్హత కలిగిన జవాన్లకు అవసరమైన చోట శానిటరీ ఇన్‌స్పెక్టర్ల అదనపు బాధ్యతలు అప్పగించి, పారిశుద్ధ్య వ్యవస్థను మరింత పటిష్టం చేయాలని సూచించారు.
ఇంటి నిర్మాణ అనుమతుల జారీ విషయంలో ప్రభుత్వ నిబంధనలను తూచా తప్పకుండా పాటించాలని కలెక్టర్ సూచించారు. నిర్ణీత గడువులోగా అర్హులైన దరఖాస్తుదారులకు అనుమతులు జారీ చేయాలని, నిబంధనలకు విరుద్ధంగా (లేదా) లోపాలు ఉన్న దరఖాస్తులను నిబంధనల ప్రకారం తిరస్కరించాలన్నారు. అనుమతి లేని నిర్మాణాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించరాదని, అనుమతులకు అనుగుణంగానే భవన నిర్మాణాలు చేపట్టేలా నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. నిబంధనలు పాటించని నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి సారించి, తగిన చర్యలు తీసుకోవాలన్నారు.
జనన, మరణ ధ్రువీకరణ పత్రాల జారీలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండరాదని, ప్రజలకు అవసరమైన సేవలను నిర్ణీత సమయంలో అందించాలని సూచించారు. ట్రేడ్ లైసెన్సుల జారీ ప్రక్రియలో మరింత పురోగతి సాధించాలని, నిబంధనలకు అనుగుణంగా లైసెన్సులను జారీ చేయాలని ఆదేశించారు.
మున్సిపాలిటీ పరిధిలోని ప్రకటనలపై వసూలు చేసే అడ్వర్టైజ్‌మెంట్ చార్జీలను నిబంధనల ప్రకారం పునఃసమీక్షించి, అవసరమైన మేరకు రీ-షెడ్యూల్ చేయాలని సూచించారు. టెండర్లు, రీ-టెండర్ల ప్రక్రియను వేగవంతం చేసి, నిబంధనల మేరకు చర్యలు చేపట్టాలన్నారు.
మున్సిపాలిటీకి సంబంధించిన పూర్తి సమాచారాన్ని సమగ్రంగా సేకరించి, విభాగాల వారీగా వివరాలను మున్సిపల్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచాలని కలెక్టర్ సూచించారు. ప్రజలకు అవసరమైన సమాచారం సులభంగా అందేలా పారదర్శకతకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.
మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రజల భాగస్వామ్యం కూడా కీలకమని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రజలు తమ ఇంటి పన్ను, నీటి పన్ను, తదితర పన్నులను సకాలంలో చెల్లించి, మున్సిపాలిటీ అభివృద్ధికి తోడ్పాటునందించాలని కోరారు. ప్రజలకు నాణ్యమైన సేవలు అందించడమే లక్ష్యంగా అధికారులు, సిబ్బంది పని చేయాలని సూచించారు.
ఈ సమీక్ష సమావేశంలో మున్సిపల్ ఛైర్పర్సన్ కడకంచి బాలమణి, మున్సిపల్ కమిషనర్ రాజశేఖర్ రెడ్డి, మున్సిపల్ శాఖ మేనేజర్ ప్రభాకర్, డీఈ రాజ్‌కుమార్, వార్డు అధికారులు, ఇంజనీరింగ్ అధికారులు, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు, బిల్ కలెక్టర్లు, ఇతర సంబంధిత అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.