Thursday, 17 September 2026
  • Home  
  • మునగపాక పోలీస్ స్టేషన్‌పై ఎస్పీ ఆకస్మిక తనిఖీ.. పెండింగ్ కేసుల పరిష్కారానికి ఆదేశం
- అనకాపల్లి

మునగపాక పోలీస్ స్టేషన్‌పై ఎస్పీ ఆకస్మిక తనిఖీ.. పెండింగ్ కేసుల పరిష్కారానికి ఆదేశం

మునగపాక, సెప్టెంబర్ 16 – పున్నమి ప్రతినిధి అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఐపీఎస్ మునగపాక పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్‌లోని సాధారణ డైరీ, క్రైమ్ రికార్డులు, పెండింగ్ కేసుల దస్త్రాలు, రిసెప్షన్, ఆయుధాగారం, పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులతో గౌరవంగా వ్యవహరిస్తూ, వారి సమస్యలకు సత్వర పరిష్కారం చూపాలని సిబ్బందికి సూచించారు. పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని, నాన్‌ బెయిలబుల్ వారెంట్ల అమలుపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. గ్రామాల్లో రాత్రి గస్తీని ముమ్మరం చేయడంతో పాటు ప్రధాన కూడళ్లలో సీసీ కెమెరాల నిఘాను పెంచాలని తెలిపారు. గంజాయి, నాటుసారా, అక్రమ మద్యం, పేకాట వంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. మహిళలు, చిన్నారుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, శక్తి యాప్‌పై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.

మునగపాక, సెప్టెంబర్ 16 – పున్నమి ప్రతినిధి

అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఐపీఎస్ మునగపాక పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్‌లోని సాధారణ డైరీ, క్రైమ్ రికార్డులు, పెండింగ్ కేసుల దస్త్రాలు, రిసెప్షన్, ఆయుధాగారం, పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులతో గౌరవంగా వ్యవహరిస్తూ, వారి సమస్యలకు సత్వర పరిష్కారం చూపాలని సిబ్బందికి సూచించారు. పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని, నాన్‌ బెయిలబుల్ వారెంట్ల అమలుపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. గ్రామాల్లో రాత్రి గస్తీని ముమ్మరం చేయడంతో పాటు ప్రధాన కూడళ్లలో సీసీ కెమెరాల నిఘాను పెంచాలని తెలిపారు. గంజాయి, నాటుసారా, అక్రమ మద్యం, పేకాట వంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. మహిళలు, చిన్నారుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, శక్తి యాప్‌పై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.