అనపర్తి, సెప్టెంబర్ 16 (పున్నమి ప్రతినిధి): వినాయక చవితి నవ రాత్రుల మహోత్సవాన్ని పురస్కరించుకుని ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ బిక్కవోలులోని ప్రసిద్ధ శ్రీ లక్ష్మీ గణపతి దేవస్థానంలో బుధవారం లక్ష్మీ గణపతి హోమాన్ని ఘనంగా నిర్వహించారు. అనపర్తి నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ నల్లమిల్లి మనోజ్ రెడ్డి–సుమేఘ దంపతులు, అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి–మహాలక్ష్మి దంపతులు హోమ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు, హోమ కార్యక్రమాలు నిర్వహించి ప్రజల సుఖసంతోషాలు, శ్రేయస్సు కోసం ప్రార్థనలు చేశారు. కార్యక్రమంలో అనపర్తి నియోజకవర్గ కూటమి నాయకులు, కార్యకర్తలు, తెలుగు మహిళా నాయకులు, భక్తులు పాల్గొన్నారు.



