Friday, 4 September 2026
  • Home  
  • మహిళల స్వావలంబనే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం సత్తుపల్లిలో ఘనంగా ఇందిరా మహిళా శక్తి చీరలు, కుట్టు మిషన్ల పంపిణీ
- ఖమ్మం

మహిళల స్వావలంబనే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం సత్తుపల్లిలో ఘనంగా ఇందిరా మహిళా శక్తి చీరలు, కుట్టు మిషన్ల పంపిణీ

సత్తుపల్లి/ ఖమ్మం సత్తుపల్లి పట్టణంలోని ఎంఆర్ గార్డెన్స్ ఫంక్షన్ హాల్‌లో శుక్రవారం ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. రాష్ట్ర మంత్రి సీతక్కతో కలిసి సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి మహిళా లబ్ధిదారులకు చీరలు అందజేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం 1000 రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలనే లక్ష్యంతో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం, తెలంగాణ రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ సహకారంతో 100 మంది మహిళలకు కుట్టు మిషన్లు అందజేశారు. కుట్టు మిషన్ల ద్వారా మహిళలు స్వయం ఉపాధి పొందుతూ కుటుంబాలకు ఆర్థికంగా అండగా నిలవాలని ఎమ్మెల్యే రాగమయి ఆకాంక్షించారు. సత్తుపల్లి అభివృద్ధికి సహకరిస్తున్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలకు ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళా కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్, డ్వాక్రా మహిళలు, అంగన్వాడీ టీచర్లు, మహిళలు పాల్గొన్నారు.

సత్తుపల్లి/ ఖమ్మం

సత్తుపల్లి పట్టణంలోని ఎంఆర్ గార్డెన్స్ ఫంక్షన్ హాల్‌లో శుక్రవారం ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. రాష్ట్ర మంత్రి సీతక్కతో కలిసి సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి మహిళా లబ్ధిదారులకు చీరలు అందజేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం 1000 రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలనే లక్ష్యంతో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం, తెలంగాణ రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ సహకారంతో 100 మంది మహిళలకు కుట్టు మిషన్లు అందజేశారు. కుట్టు మిషన్ల ద్వారా మహిళలు స్వయం ఉపాధి పొందుతూ కుటుంబాలకు ఆర్థికంగా అండగా నిలవాలని ఎమ్మెల్యే రాగమయి ఆకాంక్షించారు. సత్తుపల్లి అభివృద్ధికి సహకరిస్తున్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలకు ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళా కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్, డ్వాక్రా మహిళలు, అంగన్వాడీ టీచర్లు, మహిళలు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.