Saturday, 13 June 2026
  • Home  
  • విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో మరొకరు మృతి
- విశాఖపట్నం

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో మరొకరు మృతి

విశాఖపట్నం, (పున్నమి ప్రతినిధి): విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ఇటీవల జరిగిన ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న మరో కార్మికుడు మృతి చెందాడు. పెదగంట్యాడ మండలం సీతానగరం గ్రామానికి చెందిన సూరిబాబు సెవెన్ హిల్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం కన్నుమూశారు. సూరిబాబు మృతితో ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 10కు చేరింది. ప్రమాదం జరిగినప్పటి నుంచి ఆయన తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా, వైద్యుల ప్రయత్నాలు ఫలించలేదు. మృతుడు సూరిబాబుకు భార్య వరలక్ష్మి, కుమారుడు లోకేష్, కుమార్తె ప్రమీల ఉన్నారు. కుటుంబ పెద్దను కోల్పోవడంతో ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. సూరిబాబు స్వగ్రామమైన సీతానగరంలోనూ విషాద ఛాయలు అలుముకున్నాయి. గ్రామస్థులు, బంధుమిత్రులు పెద్ద సంఖ్యలో ఆయన కుటుంబాన్ని పరామర్శిస్తూ సంతాపం తెలియజేస్తున్నారు. స్టీల్ ప్లాంట్‌లో జరిగిన ఈ విషాద ఘటనపై కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తుండగా, ప్రమాదానికి గల కారణాలపై విచారణ కొనసాగుతోంది. మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని, భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా కఠిన భద్రతా చర్యలు చేపట్టాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

విశాఖపట్నం, (పున్నమి ప్రతినిధి): విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ఇటీవల జరిగిన ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న మరో కార్మికుడు మృతి చెందాడు. పెదగంట్యాడ మండలం సీతానగరం గ్రామానికి చెందిన సూరిబాబు సెవెన్ హిల్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం కన్నుమూశారు.
సూరిబాబు మృతితో ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 10కు చేరింది. ప్రమాదం జరిగినప్పటి నుంచి ఆయన తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా, వైద్యుల ప్రయత్నాలు ఫలించలేదు.
మృతుడు సూరిబాబుకు భార్య వరలక్ష్మి, కుమారుడు లోకేష్, కుమార్తె ప్రమీల ఉన్నారు. కుటుంబ పెద్దను కోల్పోవడంతో ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. సూరిబాబు స్వగ్రామమైన సీతానగరంలోనూ విషాద ఛాయలు అలుముకున్నాయి. గ్రామస్థులు, బంధుమిత్రులు పెద్ద సంఖ్యలో ఆయన కుటుంబాన్ని పరామర్శిస్తూ సంతాపం తెలియజేస్తున్నారు.
స్టీల్ ప్లాంట్‌లో జరిగిన ఈ విషాద ఘటనపై కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తుండగా, ప్రమాదానికి గల కారణాలపై విచారణ కొనసాగుతోంది. మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని, భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా కఠిన భద్రతా చర్యలు చేపట్టాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.