తమిళనాడులోని తిరువள்ளూరు జిల్లాలో ఉన్న సముద్ర ఆహార ప్రాసెసింగ్ యూనిట్‌లో జరిగిన అమోనియా గ్యాస్ లీక్ ఘటనలో మృతుల సంఖ్య ఏడుకు చేరింది. మరణించిన వారందరూ ఒడిశాకు చెందిన మహిళా కార్మికులేనని అధికారులు తెలిపారు. మొత్తం 77 మంది కార్మికులు గ్యాస్ ప్రభావానికి గురికాగా, వారిలో పలువురు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఆదివారం ఇద్దరు మృతి చెందగా, సోమవారం మరో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. బాధితుల కుటుంబాలకు ఒడిశా ప్రభుత్వం ఆర్థిక సాయం ప్రకటించింది. మృతదేహాలను స్వస్థలాలకు తరలించేందుకు చర్యలు చేపట్టింది. పరిశ్రమలో సాధారణ కార్యకలాపాల సమయంలో గ్యాస్ లీక్ జరిగిందని ప్రాథమిక సమాచారం వెల్లడించింది. ఘటనపై అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

తమిళనాడులో అమోనియా గ్యాస్ లీక్.. మృతుల సంఖ్య 7కు పెరుగుదల