ఖమ్మం ఆగష్టు
(పున్నమి న్యూస్)
ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం న్యూ లక్ష్మీపురం గ్రామానికి చెందిన నిరుద్యోగి గడ్డం వేణు ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల కావడం లేదనే మనస్తాపంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం అత్యంత బాధాకరమని భారతీయ జనతా యువమోర్చా (బీజేవైఎం) ఖమ్మం జిల్లా నాయకులు వాళ్ళలా రమేష్ అన్నారు
గడ్డం వేణు కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని రమేష్ ప్రభుత్వం ని డిమాండ్ చేసారు. కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వచ్చే ముందు
రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చిందని, అయితే అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు పూర్తవుతున్నా ఖాళీ ఉద్యోగాల భర్తీకి తగిన చర్యలు చేపట్టలేదని రమేష్ విమర్శించారు
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న అన్ని ప్రభుత్వ ఉద్యోగాలకు వెంటనే నోటిఫికేషన్లు విడుదల చేసి నియామక ప్రక్రియను పూర్తి చేయాలని . లేని పక్షంలో నిరుద్యోగుల పక్షాన పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని రమేష్ హెచ్చరించారు
అలాగే, గడ్డం వేణు ఆరోగ్య పరిస్థితిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి మెరుగైన వైద్యం అందించాలని కోరింది. వేణుకు ఏదైనా అపాయం జరిగితే అందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క బాధ్యత వహించాలని వాళ్ళలా రమేష్ పేర్కొన్నారు

