రాజమహేంద్రవరం, ఆగష్టు 2 (రమేష్ నాయుడు – పున్నమి ప్రతినిధి): అనపర్తి నియోజకవర్గ పర్యటనకు విచ్చేసిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నాయకులు శ్రీ నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి గారికి రాజమహేంద్రవరం విమానాశ్రయంలో అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. అనంతరం ఇరువురు నాయకులు నియోజకవర్గానికి సంబంధించిన పలు అంశాలపై పరస్పరం చర్చించుకున్నారు. నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి పర్యటన నేపథ్యంలో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.


