ఎల్బీనగర్: కర్మాన్ ఘాట్, మైత్రిపురం కాలనీలో, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని భరోసా న్యూరో సైకియాట్రీ హాస్పిటల్స్‌లో గురువారం రోజున ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎల్బీనగర్ బీజేపీ ఇన్చార్జి సామ రంగారెడ్డి భరోసా న్యూరో సైకియాట్రీ హాస్పిటల్స్‌ను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదిన వేడుకల్లో భాగంగా కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించారు. భరోసా న్యూరో సైకియాట్రీ హాస్పిటల్స్ వ్యవస్థాపకుడు డాక్టర్ ఏ. ఉదయ్ కిరణ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సామ రంగారెడ్డి ఆసుపత్రి సేవలను అభినందించారు. ఆసుపత్రిని సందర్శించి పూజా కార్యక్రమంలో పాల్గొన్న సామరంగారెడ్డికి డాక్టర్ ఏ. ఉదయ్ కిరణ్ కృతజ్ఞతలు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ దేశాభివృద్ధికి ఆయన చేస్తున్న కృషిని కొనియాడారు.


