Sunday, 9 August 2026
  • Home  
  • యువజన కాంగ్రెస్ 66వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించిన బుధరావుపేట కాంగ్రెస్ నాయకులు
- వరంగల్

యువజన కాంగ్రెస్ 66వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించిన బుధరావుపేట కాంగ్రెస్ నాయకులు

తేదీ: 09-08-2026 రోజున వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలం బుధరావుపేట గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గద్దె వద్ద బుధరావుపేట యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో 66వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని యువజన కాంగ్రెస్ పార్టీ జెండాను ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ జాయింట్ సెక్రటరీ శ్రీ మోడేం ఎల్లగౌడ్ గారు ముఖ్య అతిథిగా హాజరై యువజన కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగురవేసి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ మోడేం ఎల్లగౌడ్ గారు మాట్లాడుతూ, యువజన కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య విలువలు, సామాజిక న్యాయం, సమానత్వం మరియు ప్రజాసేవకు కట్టుబడి పనిచేస్తూ ప్రజల పక్షాన నిరంతరం నిలుస్తోందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్లడంతో పాటు, ప్రజా సమస్యల పరిష్కారం కోసం యువత ముందుండి పోరాడాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బుధరావుపేట గ్రామ సర్పంచ్ శ్రీమతి పెసరు రాణి గోవర్ధన్ రెడ్డి గారు, పార్టీ అధ్యక్షులు శ్రీ లింగిడి వెంకటేశ్వర్లు గారు, నర్సంపేట నియోజకవర్గ యువజన కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ పల్సా ప్రశాంత్ గారు పాల్గొని కార్యక్రమానికి తమ మద్దతు తెలిపారు. అలాగే కాంగ్రెస్ పార్టీ వార్డు సభ్యులు, మండల నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు యువజన కాంగ్రెస్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

తేదీ: 09-08-2026 రోజున వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలం బుధరావుపేట గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గద్దె వద్ద బుధరావుపేట యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో 66వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని యువజన కాంగ్రెస్ పార్టీ జెండాను ఘనంగా ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ జాయింట్ సెక్రటరీ శ్రీ మోడేం ఎల్లగౌడ్ గారు ముఖ్య అతిథిగా హాజరై యువజన కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగురవేసి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా శ్రీ మోడేం ఎల్లగౌడ్ గారు మాట్లాడుతూ, యువజన కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య విలువలు, సామాజిక న్యాయం, సమానత్వం మరియు ప్రజాసేవకు కట్టుబడి పనిచేస్తూ ప్రజల పక్షాన నిరంతరం నిలుస్తోందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్లడంతో పాటు, ప్రజా సమస్యల పరిష్కారం కోసం యువత ముందుండి పోరాడాలని పిలుపునిచ్చారు

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బుధరావుపేట గ్రామ సర్పంచ్ శ్రీమతి పెసరు రాణి గోవర్ధన్ రెడ్డి గారు, పార్టీ అధ్యక్షులు శ్రీ లింగిడి వెంకటేశ్వర్లు గారు, నర్సంపేట నియోజకవర్గ యువజన కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ పల్సా ప్రశాంత్ గారు పాల్గొని కార్యక్రమానికి తమ మద్దతు తెలిపారు.

అలాగే కాంగ్రెస్ పార్టీ వార్డు సభ్యులు, మండల నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు యువజన కాంగ్రెస్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.