Saturday, 29 August 2026
  • Home  
  • మహానంది క్షేత్రంలో వైభవంగా శ్రావణ పౌర్ణమి వేడుకలు: శ్రీ కామేశ్వరీ అమ్మవారికి ప్రత్యేక పూజలు
- నంద్యాల

మహానంది క్షేత్రంలో వైభవంగా శ్రావణ పౌర్ణమి వేడుకలు: శ్రీ కామేశ్వరీ అమ్మవారికి ప్రత్యేక పూజలు

నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన మహానందిలో శ్రావణ శుక్రవారం, శ్రావణ పౌర్ణమిల పవిత్ర సందర్భాన్ని పురస్కరించుకుని లోకకళ్యాణార్థం విశేష పూజా కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ కామేశ్వరీ దేవి సమేత మహానందీశ్వర స్వామివారికి ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా ప్రత్యేక అభిషేకార్చనలు, హోమాలు, జపాలను నిర్వహించారు. మయూర పింఛాల అలంకరణలో దేవి అలభ్య దర్శనం: ఈ పవిత్ర పర్వదినాన శ్రీ కామేశ్వరీ అమ్మవారిని రంగురంగుల నెమలి ఈకలతో (మయూర పింఛములతో) అద్భుతంగా అలంకరించారు. ప్రకృతి సౌందర్యంతో శోభిల్లిన అమ్మవారి దివ్య మంగళ రూపం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. పోటెత్తిన భక్తజనం: తెల్లవారుజాము నుంచే తెలుగు రాష్ట్రాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు మహానందికి చేరుకుని క్షేత్ర గుండాల్లో పుణ్యస్నానాలు ఆచరించారు. అనంతరం స్వామి అమ్మవార్లను దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకున్నారు. మయూర పింఛాల అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారిని తిలకించి భక్తులు పరవశించిపోయి దివ్యానుభూతిని పొందారు.

నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన మహానందిలో శ్రావణ శుక్రవారం, శ్రావణ పౌర్ణమిల పవిత్ర సందర్భాన్ని పురస్కరించుకుని లోకకళ్యాణార్థం విశేష పూజా కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ కామేశ్వరీ దేవి సమేత మహానందీశ్వర స్వామివారికి ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా ప్రత్యేక అభిషేకార్చనలు, హోమాలు, జపాలను నిర్వహించారు.
మయూర పింఛాల అలంకరణలో దేవి అలభ్య దర్శనం:
ఈ పవిత్ర పర్వదినాన శ్రీ కామేశ్వరీ అమ్మవారిని రంగురంగుల నెమలి ఈకలతో (మయూర పింఛములతో) అద్భుతంగా అలంకరించారు. ప్రకృతి సౌందర్యంతో శోభిల్లిన అమ్మవారి దివ్య మంగళ రూపం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.
పోటెత్తిన భక్తజనం:
తెల్లవారుజాము నుంచే తెలుగు రాష్ట్రాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు మహానందికి చేరుకుని క్షేత్ర గుండాల్లో పుణ్యస్నానాలు ఆచరించారు. అనంతరం స్వామి అమ్మవార్లను దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకున్నారు. మయూర పింఛాల అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారిని తిలకించి భక్తులు పరవశించిపోయి దివ్యానుభూతిని పొందారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.