మంగళగిరి నియోజకవర్గంలో పేదలకు శాశ్వత ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమంలో భాగస్వాములైన అధికారులు, ఎంటీఎంసీ, రెవెన్యూ సిబ్బంది, వారి కుటుంబ సభ్యులతో ఉండవల్లి నివాసం వద్ద ఏర్పాటుచేసిన ప్రత్యేక వేదికలో ఆత్మీయ విందు సమావేశం నిర్వహించాను. ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం విజయవంతానికి కృషిచేసిన అధికారులకు మంగళగిరి ప్రజల తరపున ధన్యవాదాలు తెలియజేశాను. కలిసికట్టుగా పనిచేస్తే చేస్తే ఏదైనా సాధించగలుగుతామని, అన్ని రంగాల్లో మంగళగిరి నెం.1గా ఉండాలనేది లక్ష్యమని, భవిష్యత్ లోనూ అధికారుల సహకారం ఉండాలని ఆశిస్తున్నానని ఈ సందర్భంగా చెప్పాను. అందరికీ నూతన వస్త్రాలు బహూకరించి సత్కరించాను.



