Thursday, 3 September 2026
  • Home  
  • బీజేపీ కార్యాలయంపై దాడికి నిరసనగా ఖమ్మం 3 టౌన్లో బీజేవైఎం, బిజెపి ధర్నా
- ఖమ్మం

బీజేపీ కార్యాలయంపై దాడికి నిరసనగా ఖమ్మం 3 టౌన్లో బీజేవైఎం, బిజెపి ధర్నా

తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై కాంగ్రెస్ నాయకులు దాడి చేశారని ఆరోపిస్తూ ఖమ్మం త్రీటౌన్‌ గాంధీ బొమ్మ సెంటర్‌లో బీజేవైఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసేందుకు బీజేపీ నాయకులు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసుల తీరుపై బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. బీజేపీ, బీజేవైఎం నాయకులు మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీల కార్యాలయాలపై దాడులు చేయడం సరికాదన్నారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో శాసనాల సాయిరామ్, నకరికంటి వీరభద్రం, పమ్మి అనిత, కొణతం లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.