ఖమ్మం జులై
(పున్నమి న్యూస్ )
సింగరేణి కార్మికుల సంక్షేమం, ఉద్యోగ భద్రత, బొగ్గు పరిశ్రమ అభివృద్ధి లక్ష్యంగా నిర్వహిస్తున్న సింగరేణి భరోసా యాత్రను విజయవంతం చేయాలని ఖమ్మం బీజేపీ 2 టౌన్ అధ్యక్షుడు ధనియాకుల వెంకటనారాయణ కోరారు. కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రామచంద్రరావు ఆధ్వర్యంలో జరిగే ఈ యాత్ర ద్వారా కార్మికులకు భరోసా కల్పిస్తామని తెలిపారు. సింగరేణి బలోపేతమే తెలంగాణ అభివృద్ధికి పునాది అని పేర్కొన్నారు.


