Friday, 28 August 2026
  • Home  
  • బీజేపీ కార్యాలయంలో ఘనంగా రక్షాబంధన్ వేడుకలు.జిల్లా అధ్యక్షుడి నెల్లూరి కోటేశ్వరరావు కి రాఖీ కట్టిన మహిళా నేతలు.
- ఖమ్మం

బీజేపీ కార్యాలయంలో ఘనంగా రక్షాబంధన్ వేడుకలు.జిల్లా అధ్యక్షుడి నెల్లూరి కోటేశ్వరరావు కి రాఖీ కట్టిన మహిళా నేతలు.

ఖమ్మం జిల్లా బీజేపీ కార్యాలయంలో రక్షాబంధన్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు మందా సరస్వతి, బీజేపీ జిల్లా కార్యదర్శి శ్రీరామనేని మణి, నాగమణి తదితరులు బీజేపీ జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావుకు రాఖీ కట్టారు. రక్షాబంధన్ పండుగ సందర్భంగా సోదరభావం, ఆత్మీయతను చాటుకుంటూ ఒకరికొకరు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మహిళా మోర్చా నాయకులు మాట్లాడుతూ రక్షాబంధన్ పండుగ సోదరసోదరీమణుల మధ్య ప్రేమ, అనుబంధానికి ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. బీజేపీ కుటుంబంలో పరస్పర సహకారం, సోదరభావంతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, మహిళా మోర్చా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.