యలమంచిలి మండలం ఏటికొప్పాక గ్రామంలో రాఖీ పౌర్ణమి సందర్భంగా ఆత్మీయ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎలమంచిలి నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ సుందరపు విజయ్‌కుమార్ గారికి అనకాపల్లి జిల్లా కలెక్టర్ శ్రీమతి విజయకృష్ణన్ గారు రాఖీ కట్టి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ సుందరపు విజయ్‌కుమార్ గారు మాట్లాడుతూ రాఖీ పౌర్ణమి అన్నాచెల్లెళ్ల మధ్య ప్రేమ, ఆత్మీయత, అనుబంధానికి ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. జిల్లా అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం కలెక్టర్ శ్రీమతి విజయకృష్ణన్ గారు చేస్తున్న కృషిని ఎమ్మెల్యే గారు అభినందించారు.ఈ కార్యక్రమంలో అధికారులు, కార్యకర్తలు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.


