అన్నాచెల్లెళ్ల అనుబంధానికి రాఖీ పండుగ ప్రతీక అని ఏపీఎస్పీ 11వ పోలీస్ బెటాలియన్ కమాండెంట్ కె. ఆనందరెడ్డి అన్నారు. శుక్రవారం సిద్ధవటం మండలం భాకరాపేట సమీపంలోని 11వ పోలీస్ బెటాలియన్లో రాఖీ పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కమాండెంట్ కె. ఆనందరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి నేషనల్ హైవే అథారిటీకి చెందిన అమ్రీత్ గౌతమ్, త్రిప్తా గౌతమ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా త్రిప్తా గౌతమ్ కమాండెంట్ కె. ఆనందరెడ్డి, అసిస్టెంట్ కమాండెంట్లు, పోలీసు సిబ్బందికి రాఖీలు కట్టి రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. రాఖీ పండుగ సోదరసోదరీమణుల మధ్య ప్రేమ, ఆప్యాయత, అనుబంధానికి ప్రతీకగా నిలుస్తుందని కమాండెంట్ పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం బెటాలియన్లో రాఖీ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డీఎస్పీ/అసిస్టెంట్ కమాండెంట్ కె. వెంకటప్ప, పి. రాజశేఖర్, ఆర్ఐలు, ఆర్ఎస్ఐలు, ఏఆర్ఎస్ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.


