ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జూన్ 18 (పున్నమి ప్రతినిధి)
మనుబోలు మండల కేంద్రంలో బుధవారం అర్ధరాత్రి దుండగులు మూడు ఆలయాల్లో చోరీకి పాల్పడ్డారు. గ్రామ దేవతలైన మనుబోలమ్మ, నాగరప్పమ్మ, గంగమ్మ ఆలయాల తాళాలు పగులగొట్టి లోనికి ప్రవేశించిన దొంగలు మూడు హుండీలను ధ్వంసం చేసి అందులోని లక్ష రూపాయలకు పైగా నగదును అపహరించినట్లు స్థానికులు తెలిపారు. గురువారం ఉదయం ఆలయాలు తెరవడానికి వచ్చిన భక్తులు ఘటనను గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఆధారాలు సేకరించి పరిశీలించారు. సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తూ కేసు నమోదు చేసి దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనతో గ్రామంలో ఆందోళన నెలకొంది.

మూడు ఆలయాల్లో చోరీ… లక్షకు పైగా నగదు అపహరణ
ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జూన్ 18 (పున్నమి ప్రతినిధి) మనుబోలు మండల కేంద్రంలో బుధవారం అర్ధరాత్రి దుండగులు మూడు ఆలయాల్లో చోరీకి పాల్పడ్డారు. గ్రామ దేవతలైన మనుబోలమ్మ, నాగరప్పమ్మ, గంగమ్మ ఆలయాల తాళాలు పగులగొట్టి లోనికి ప్రవేశించిన దొంగలు మూడు హుండీలను ధ్వంసం చేసి అందులోని లక్ష రూపాయలకు పైగా నగదును అపహరించినట్లు స్థానికులు తెలిపారు. గురువారం ఉదయం ఆలయాలు తెరవడానికి వచ్చిన భక్తులు ఘటనను గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఆధారాలు సేకరించి పరిశీలించారు. సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తూ కేసు నమోదు చేసి దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనతో గ్రామంలో ఆందోళన నెలకొంది.

