నంది వడ్డేమాన్ గ్రామంలో మంగళవారం ‘బడిబాట’ కార్యక్రమాన్ని ఉపాధ్యాయులు, విద్యార్థులు ఘనంగా నిర్వహించారు. గ్రామ సంత, రచ్చకట్ట వేదికగా ప్రభుత్వ పాఠశాలల్లో లభించే వసతులు, ఉచిత సౌకర్యాలపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. అర్హులైన ప్రతి విద్యార్థి ప్రభుత్వ బడిలోనే చేరి, నాణ్యమైన విద్యను అభ్యసించాలని ప్రధానోపాధ్యాయులు జి. మురళీమోహన్ ఆచార్యులు కోరారు. ఇక్కడ శిక్షణ పొందిన నైపుణ్యంగల ఉపాధ్యాయులు ఉంటారని తెలిపారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ నాగరాజు, ఉపాధ్యాయులు చంద్రమోహన్ రెడ్డి, కృష్ణ కుమార్, హుస్సేన్, సతీష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.



