రాయదుర్గం పట్టణం కోటల వెలసిన శ్రీ స్వయంభు జంబుకేశ్వరుడు సోమవారం ప్రత్యేక అలంకరణలో భక్తులకు కనువిందు చేశాడు. పురోహితుల రామకృష్ణ ఉదయాన్నే స్వామి మూల విరాట్ కు పంచామృత, వివిధ అభిషేకాలు చేపట్టి బిళ్ళ వక్కలతో స్వామి మూలవిరాట్ ను విశేషంగా అలంకరించి మంగళ నైవేద్యాలు అందించారు. సోమవారం ప్రత్యేకించి స్వామివారిని ఆరాధిస్తే సకల శుభాలు కలుగుతాయని సూచించారు.భక్తుల పెద్ద ఎత్తున విచ్చేసి దర్శించుకున్నారు.



