యలమంచిలి : పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్
ఏటికొప్పాక గ్రామ గ్రంథాలయంపై పున్నమి న్యూస్‌లో వచ్చిన వార్తకు లైబ్రేరియన్ వి. ఆనంద్ రావు సానుకూలంగా స్పందించారు. ఎలమంచిలి గ్రంథాలయాన్ని పర్యవేక్షిస్తున్న తాను ప్రతి వారం బుధవారం ఏటికొప్పాక గ్రామ గ్రంథాలయంలో అందుబాటులో ఉంటానని తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా గ్రంథాలయ శాఖలో సిబ్బంది పోస్టుల కొరత ఉండటంతో గ్రంథాలయాల నిర్వహణలో కొంత ఇబ్బంది ఏర్పడుతోందని వి. ఆనంద్ రావు పేర్కొన్నారు. అయినప్పటికీ ఏటికొప్పాక గ్రంథాలయాన్ని అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
యువత, విద్యార్థులకు అవసరమైన వార్తా పత్రికలు, న్యూస్ పేపర్స్‌తో పాటు కావలసిన పుస్తకాలు గ్రంథాలయంలో అందుబాటులో ఉన్నాయని చెప్పారు. యువత, విద్యార్థులు గ్రంథాలయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
అలాగే తమకు అవసరమైన పుస్తకాలు ఏవైనా ఉంటే గ్రంథాలయానికి వచ్చే వారు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన నోట్‌బుక్‌లో తమకు కావాల్సిన పుస్తకాల వివరాలను నమోదు చేయాలని, ఆ వివరాల ఆధారంగా అవసరమైన పుస్తకాలను అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
గ్రంథాలయానికి సంబంధించి ఇంకా చేయాల్సిన పనులు ఉన్నాయని, వాటిని కూడా దశలవారీగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని వి. ఆనంద్ రావు తెలిపారు. పున్నమి న్యూస్ కథనంపై స్పందించి యువతకు గ్రంథాలయ సేవలను మరింత అందుబాటులోకి తీసుకురావడానికి ముందుకు వచ్చిన లైబ్రేరియన్ వి. ఆనంద్ రావుపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

