ఆత్మకూరు, ఆగస్టు 20 (పున్నమి ప్రతినిధి): ప్రపంచ దోమల దినోత్సవాన్ని పురస్కరించుకుని యూపీహెచ్‌సీ అరుంధతివాడ ఆధ్వర్యంలో గురువారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. వైద్యాధికారి డాక్టర్ సాయి ప్రసన్న ఆధ్వర్యంలో మున్సిపల్ బస్టాండ్ పరిధిలో జరిగిన ఈ ర్యాలీలో వైద్య, ఆరోగ్య సిబ్బంది, ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
మలేరియా, డెంగ్యూ, చికున్‌గున్యా, ఫైలేరియా వంటి దోమల ద్వారా వ్యాపించే వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఇళ్ల పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూడాలని, పాత టైర్లు, కొబ్బరి చిప్పలు, ప్లాస్టిక్ కవర్లు, డబ్బాలు, కూలర్లు, పూల కుండీల్లో నీరు నిల్వ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వారానికి కనీసం ఒకసారి నీటి నిల్వలను ఖాళీ చేసి శుభ్రం చేయాలని తెలిపారు.ఈ సందర్భంగా హెల్త్ సూపర్వైజర్ ఎస్. సుధాకర్, హెచ్‌పీ పార్వతి, హెల్త్ అసిస్టెంట్ జి. రవీందర్‌రెడ్డి, శ్రీరాములు తదితరులు దోమల నియంత్రణ ఆవశ్యకతను వివరించారు. మలేరియాపై పరిశోధనలు చేసిన సర్ రొనాల్డ్ రాస్ సేవలను సిబ్బంది గుర్తు చేసుకున్నారు.“దోమలను చంపడం మాత్రమే కాదు.. అవి పెరిగే ప్రదేశాలను నిర్మూలించడం ప్రతి ఒక్కరి బాధ్యత” అని తెలిపారు. జ్వరం, చలి, వణుకు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీప ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలని సూచించారు. “దోమల నివారణ–ఆరోగ్యకరమైన సమాజానికి తొలి అడుగు” అనే సందేశంతో ర్యాలీ కొనసాగింది.

దోమల నివారణతోనే వ్యాధుల నియంత్రణ
ఆత్మకూరు, ఆగస్టు 20 (పున్నమి ప్రతినిధి): ప్రపంచ దోమల దినోత్సవాన్ని పురస్కరించుకుని యూపీహెచ్‌సీ అరుంధతివాడ ఆధ్వర్యంలో గురువారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. వైద్యాధికారి డాక్టర్ సాయి ప్రసన్న ఆధ్వర్యంలో మున్సిపల్ బస్టాండ్ పరిధిలో జరిగిన ఈ ర్యాలీలో వైద్య, ఆరోగ్య సిబ్బంది, ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. మలేరియా, డెంగ్యూ, చికున్‌గున్యా, ఫైలేరియా వంటి దోమల ద్వారా వ్యాపించే వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఇళ్ల పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూడాలని, పాత టైర్లు, కొబ్బరి చిప్పలు, ప్లాస్టిక్ కవర్లు, డబ్బాలు, కూలర్లు, పూల కుండీల్లో నీరు నిల్వ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వారానికి కనీసం ఒకసారి నీటి నిల్వలను ఖాళీ చేసి శుభ్రం చేయాలని తెలిపారు.ఈ సందర్భంగా హెల్త్ సూపర్వైజర్ ఎస్. సుధాకర్, హెచ్‌పీ పార్వతి, హెల్త్ అసిస్టెంట్ జి. రవీందర్‌రెడ్డి, శ్రీరాములు తదితరులు దోమల నియంత్రణ ఆవశ్యకతను వివరించారు. మలేరియాపై పరిశోధనలు చేసిన సర్ రొనాల్డ్ రాస్ సేవలను సిబ్బంది గుర్తు చేసుకున్నారు.“దోమలను చంపడం మాత్రమే కాదు.. అవి పెరిగే ప్రదేశాలను నిర్మూలించడం ప్రతి ఒక్కరి బాధ్యత” అని తెలిపారు. జ్వరం, చలి, వణుకు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీప ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలని సూచించారు. “దోమల నివారణ–ఆరోగ్యకరమైన సమాజానికి తొలి అడుగు” అనే సందేశంతో ర్యాలీ కొనసాగింది.

