
శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం (SVU)లో ఫలితాల విడుదల ఆలస్యంపై వేలాది మంది విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 1వ సెమిస్టర్ & సప్లిమెంటరీ, 3వ సెమిస్టర్ & సప్లిమెంటరీ, 4వ సెమిస్టర్ & సప్లిమెంటరీ రెగ్యులర్ ఫలితాల కోసం విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. ఫలితాల జాప్యం కారణంగా ఉద్యోగాలు, ఉన్నత విద్య ప్రవేశాలు, ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అధికారులు వెంటనే జోక్యం చేసుకుని రెగ్యులర్ & సప్లిమెంటరీ ఫలితాలను త్వరగా విడుదల చేయాలని, విడుదల తేదీపై స్పష్టమైన ప్రకటన చేయాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.

