తిరుపతి జిల్లా, దొరవారిసత్రం మండలం పరిధిలోని వేణుంబాకం ప్రధాన రహదారి పూర్తిగా గుంతలమయమై, వాహనదారులకు నరకంగా మారింది. రోడ్డు మీద తారు లేచిపోయి పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. వర్షం వస్తే బురదమయమై ప్రయాణించలేని పరిస్థితి నెలకొంది.
రోజూ వందలాది మంది విద్యార్థులు, రైతులు, ఉద్యోగులు ఈ రోడ్డు మీదే ప్రయాణిస్తున్నారు. గుంతల వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. వాహనాలు పాడవుతున్నాయి.
ఇప్పటికైనా సంబంధిత అధికారులు, R&B శాఖ వారు స్పందించి, వెంటనే ఈ రోడ్డును మరమ్మత్తు చేసి, కొత్తగా వేయాలని గ్రామ ప్రజల తరపున కోరుతున్నాము.
*ఇట్లు,*
*వేణుంబాకం గ్రామ ప్రజలు,*
*దొరవారిసత్రం మండలం.


