వింజమూరు: ఉదయగిరి నియోజకవర్గంలో డిజిటల్ విప్లవానికి నాంది పలికేలా వింజమూరు మండలం జనార్ధనపురం గ్రామ పంచాయతీలో బీఎస్‌ఎన్‌ఎల్ ఆధునిక 4జీ/5జీ మొబైల్ టవర్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. సుమారు రూ.కోటి వ్యయంతో చేపట్టనున్న పనులకు మంత్రులు ఎన్‌ఎండీ ఫరూఖ్, వాసంశెట్టి సుభాష్, ఎమ్మెల్యే కాకర్ల సురేష్ రిబ్బన్ కట్ చేసి శ్రీకారం చుట్టారు. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి సహకారంతో నియోజకవర్గంలో రూ.34 కోట్లతో 34 టవర్లకు అనుమతులు లభించాయని ఎమ్మెల్యే తెలిపారు. ఇప్పటికే 21 టవర్లకు పూర్తిస్థాయి అనుమతులు వచ్చాయని పేర్కొన్నారు.

మారుమూల గ్రామాలకు 4జీ/5జీ వెలుగులు జనార్ధనపురంలో మొబైల్ టవర్‌కు శంకుస్థాపన చేసిన మంత్రులు ఫరూఖ్, వాసంశెట్టి సుభాష్, ఎమ్మెల్యే కాకర్ల