ఖమ్మం 53వ డివిజన్‌లోని పోలింగ్ బూత్ నెంబర్ 147లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ‘మన్ కీ బాత్’ 137వ ఎపిసోడ్ లైవ్ కార్యక్రమాన్ని ఆదివారం వీక్షించారు. ఖమ్మం బీజేపీ టూ టౌన్ అధ్యక్షులు ధనియాకుల వెంకటనారాయణ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. ముఖ్యఅతిథులుగా తెలంగాణ రాష్ట్ర ఎస్టీ మోర్చా మన్ కీ బాత్ కన్వీనర్ బానోత్ శ్రీకాంత్ నాయక్, ఖమ్మం జిల్లా మన్ కీ బాత్ కన్వీనర్, బీజేపీ టూ టౌన్ ఇన్‌చార్జి దొంతు జ్వాల నరసింహారావు హాజరై మన్ కీ బాత్ విశేషాలను వివరించారు. కార్యక్రమంలో బీజేపీ టూ టౌన్ ఉపాధ్యక్షులు పాశం శ్రీనివాసరెడ్డి, నాయకురాలు కాసం మమత, తనుష్, రాజు తదితరులు పాల్గొన్నారు.


