ఖమ్మం జులై
(పున్నమి న్యూస్)
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరియు ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న SIR (ప్రత్యేక సమగ్ర ఓటరు పరిశీలన) కార్యక్రమంలో భాగంగా ఖమ్మం టూ టౌన్ పరిధిలోని ప్రధాన కార్యదర్శి రుద్ర గాని మాధవ్ ఇంచార్జి గా ఉన్న 57వ డివిజన్ పోలింగ్ బూత్ నెంబర్ 112ను ఖమ్మం జిల్లా బీజేపీ అధ్యక్షులు శ్రీ నెల్లూరి కోటేశ్వరరావు సందర్శించారు. BLO(బి ఎల్ ఒ,)అధికారి రాణి గారిని వివరాలు అడిగి తెలుసుకుని, ఆన్‌లైన్ ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. 2002 ఓటరు వివరాలను తప్పనిసరిగా నమోదు చేసి, అర్హులైన ప్రతి ఒక్కరికీ సరైన మ్యాపింగ్ ద్వారా ఓటు హక్కు కల్పించేలా కృషి చేయాలని తెలిపారు. ఇప్పటివరకు బూత్‌లో 300 దరఖాస్తుల ఆన్‌లైన్ ప్రక్రియ పూర్తయిందని తెలిపారు. కార్యక్రమంలో BLA-2 విజయ్ లు పాల్గొన్నారు.


