తొట్టంబేడు, ఆగస్టు 20, (పున్నమి న్యూస్): తొట్టంబేడు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గురువారం (20.08.2026) ప్రపంచ దోమల దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక అవగాహన కార్యక్రమం, ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మలేరియా వ్యాప్తిపై చారిత్రాత్మక పరిశోధనలు చేసిన ప్రముఖ శాస్త్రవేత్త సర్ రోనాల్డ్ రాస్ చిత్రపటానికి పూలమాలలు వేసి, ఆయన చేసిన వైద్య సేవలను వైద్య సిబ్బంది ఘనంగా స్మరించుకున్నారు. అనంతరం ప్రజల్లో దోమల నివారణ, మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధుల పట్ల అవగాహన కల్పించేందుకు ఆరోగ్య కేంద్రం నుండి ప్రధాన వీధుల గుండా ర్యాలీ నిర్వహించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం, నీరు నిల్వ ఉండకుండా చూసుకోవడం ద్వారా దోమల వ్యాప్తిని అరికట్టవచ్చని ఈ సందర్భంగా వైద్యులు సూచించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ లహరి, పీహెచ్ఎన్ సంపూర్ణ, ఎంపీహెచ్ఏ (హెచ్ఎస్) నాగేంద్ర, ధనమ్మ, ఎంపీహెచ్ఎం (ఎం) వెంకటేశ్వర్లు ముదిరాజ్, స్టాఫ్ నర్స్ నీరజ, ఫార్మసిస్ట్ నరేష్, ల్యాబ్ టెక్నీషియన్ భాను, ఏఎన్ఎంలు సంధ్య, వరలక్ష్మి, ఆశా కార్యకర్త భారతి పాల్గొన్నారు. వీరితో పాటు పాఠశాల ప్రధానోపాధ్యాయులు సుబ్రహ్మణ్యం, ఉపాధ్యాయులు నిఫీసా, గిరిబాబు మరియు వైద్య సిబ్బంది పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

తొట్టంబేడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రపంచ దోమల దినోత్సవం, అవగాహన ర్యాలీ