శ్రీ కాళహస్తి, ఆగస్టు 20, (పున్నమి న్యూస్): ప్రకృతి వ్యవసాయాన్ని ప్రతి గ్రామానికి చేరువ చేయడమే లక్ష్యంగా శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు దండి నరేంద్ర ఆధ్వర్యంలో ముచ్చివోలు గ్రామంలోని వారి నివాసం వద్ద రైతులకు ఘన జీవామృతం తయారీపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మండల ప్రకృతి వ్యవసాయ ఇన్‌చార్జ్ దార్సి ప్రసాద్, బృంద సభ్యులు కార్తీక్ కుమార్, పుష్పలత, మీనా సహకారంతో 200 కిలోల ఆవు పేడ, 4 కిలోల బెల్లం, 4 కిలోల శనగ పిండి, 4 కిలోల పుట్ట మట్టి, 5 లీటర్ల ఆవు మూత్రంతో సహజసిద్ధమైన ఎరువు తయారీ విధానాన్ని రైతులకు ప్రత్యక్షంగా వివరించారు. ఎకరానికి 400 కిలోల ఘన జీవామృతం వాడటం వల్ల నేలలో సూక్ష్మజీవులు, వానపాములు వృద్ధి చెంది నేల తేమను నిలుపుకుంటుందని, రసాయనాల వినియోగం తగ్గి పంట నాణ్యత, రోగనిరోధక శక్తి పెరుగుతాయని దండి నరేంద్ర పేర్కొన్నారు. నేల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ సేంద్రియ సాగును ప్రోత్సహించాలని కోరిన ఈ కార్యక్రమంలో రైతులు వెంకట కృష్ణయ్య, శంకరయ్య, వెంకటసుబ్బయ్య, చంద్ర శేఖర్, వెంకట సుబ్బమ్మ, మౌనిక, నవనీతమ్మ పాల్గొన్నారు.

ప్రకృతి వ్యవసాయాన్ని ప్రతి గ్రామానికి చేరువ చేయడమే లక్ష్యం-దండి నరేంద్ర