Friday, 4 September 2026
  • Home  
  • సిపిఐ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు
- ఆదిలాబాదు

సిపిఐ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సిపిఐ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ ప్రభాకర్ రెడ్డి జాతీయ పతకాన్ని ఆవిష్కరించిన అనంతరం మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పాటు అయి 12 సంవత్సరాలు పూర్తి చేసుకుందని అన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం జాతీయస్థాయిలో తీర్మానం చేసిన ఏకైక పార్టీ సిపిఐ అని అన్నారు. ఎంతోమంది ఆత్మబలి దానాల ద్వారా సాధించుకున్న రాష్ట్రానికి బిజెపి ప్రభుత్వం, గత బిఆర్ఎస్ ప్రభుత్వం చేసింది ఏమీ ఏమీ లేదని అన్నారు. అనేక సందర్భాల్లో కమ్యూనిస్టులు ఎక్కడ ఉన్నారని, ఎర్ర జెండా పార్టీలు తోక పార్టీలని విమర్శించిన కెసిఆర్ కు తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో రాష్ట్ర ప్రజలు తగిన బుద్ధి చెప్పారని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు నళిని రెడ్డి, కుంటాల రాములు, అర్ధాంగి రమేష్, అమీనా ఖాన్, కడప సురేష్, బుర్రి సత్వాజి నరసయ్య, ఖలీఫా ఖాన్, శశికాంత్ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.