శ్రీ కాళహస్తి, జులై 23, (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి లోని అంగన్వాడీ కేంద్రాలను సమూలంగా మార్చి మోడల్ సెంటర్లుగా అభివృద్ధి చేస్తున్నామని శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి తెలిపారు. గురువారం మండలంలోని అంగన్వాడీ కార్యకర్తలకు ఇండక్షన్ స్టవ్స్, కుక్కర్లు, వంట పాత్రలు, మ్యాట్లను ఆయన అందజేశారు. ఈ సందర్భంగా సుధీర్ రెడ్డి మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం మహిళాభ్యుదయం, శిశు సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని అన్నారు. పిల్లలకు నాణ్యమైన ప్రాథమిక విద్యను అందించడంతో పాటు, మూడేళ్ల లోపు పిల్లల కోసం ‘నవచేతన’ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని కార్యకర్తలకు సూచించారు. కార్యక్రమంలో మండల నాయకులు చెంచయ్య నాయుడు, కామేష్ యాదవ్, కృష్ణ యాదవ్, బత్తి రెడ్డి, జగదీశ్ రెడ్డి, ఎంపీడీఓ, సీడీపీఓ శాంతి దుర్గ, సూపర్వైజర్లు భాగ్యలక్ష్మి, ప్రియాంక, మరియు అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.

అంగన్వాడీల బలోపేతమే కూటమి ప్రభుత్వ ధ్యేయం-ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి