శ్రీ కాళహస్తి, జులై 23, (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి పట్టణ ప్రజల ఇళ్ల వద్దకే వెళ్లి నీటి పొదుపుపై అవగాహన కల్పించే సరికొత్త కార్యక్రమానికి శ్రీకాళహస్తి పురపాలక సంఘం శ్రీకారం చుట్టింది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘జల సంచయ్ జన భాగిదారి’ ప్రచారంలో భాగంగా, “Catch the Rain – 2026” విజయవంతం చేయడానికి మున్సిపల్ కమిషనర్ శ్రీ కేవీ కృష్ణారెడ్డి స్వయంగా రంగంలోకి దిగారు. గురువారం (23-07-2026) ఆయన పట్టణంలోని పలు వార్డుల్లో పర్యటించి, స్థానిక ప్రజలతో నేరుగా మాట్లాడారు. ఈ సందర్భంగా కమిషనర్ ప్రజలతో ముఖాముఖి చర్చిస్తూ… వర్షపు నీటిని ఎలా సద్వినియోగం చేసుకోవాలి, భూగర్భ జలాల మట్టాన్ని ఎలా పెంచాలి అనే విషయాలపై ఎన్నో ఉపయోగకరమైన సూచనలు చేశారు. ప్రతి ఒక్కరూ తమ ఇళ్లలో, సంస్థల్లో వర్షపు నీరు వృథా కాకుండా నిల్వ చేసేలా ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని, వర్షపు నీటిని భూమిలోకి ఇంకించడం ద్వారా వేసవిలో బోర్లు ఎండిపోకుండా కాపాడుకోవచ్చు. పట్టణంలోని చెరువులు, కుంటలు, కాలువలు వంటి నీటి వనరులను చెత్తాచెదారం వేయకుండా పునరుద్ధరించుకోవాలన్నారు. నీటి సంరక్షణ అనేది కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదు, ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత. నీరు ప్రతి జీవికి ప్రకృతి ప్రసాదించిన అమూల్యమైన కానుక అని, దానిని పొదుపుగా వాడుకోవాలని కమిషనర్ ప్రజలను కోరారు. అధికారులు, ప్రజలు కలిసికట్టుగా అడుగులు వేస్తేనే భవిష్యత్ తరాలకు తాగునీటి భద్రతను అందించగలమని ఆయన స్పష్టం చేశారు.

నీటి సంరక్షణ మన అందరి బాధ్యత-శ్రీకాళహస్తి మున్సిపల్ కమిషనర్