SIR తుది ఓటర్ల జాబితా తర్వాతే స్థానిక ఎన్నికలు
కడప, సెప్టెంబర్ 7, పున్నమి ప్రతినిధి: SIR తుది ఓటర్ల జాబితా విడుదలైన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కడప నగర కాంగ్రెస్ అధ్యక్షుడు సయ్యద్ గౌస్ పీర్ డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టరేట్లో డీఆర్ఓకు వినతిపత్రం అందజేశారు. EVMలకు బదులుగా బ్యాలెట్ పేపర్లతో ఎన్నికలు నిర్వహించాలని, ఎన్నికల అధికారులు, పోలీసులు రాజకీయ ఒత్తిళ్లకు అతీతంగా నిష్పక్షపాతంగా పనిచేయాలని కోరారు.









