ముద్రగడ పద్మనాభం గారి మరణవార్త అత్యంత బాధాకరమని పేర్కొన్న శ్రీ అకేపాటి అమర్ నాథ్ రెడ్డి గారు , సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని అన్నారు. ప్రజా జీవితంలో ఆయన అందించిన సేవలను స్మరించుకుంటూ, వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.*
ఈ విషాద సమయంలో ముద్రగడ పద్మనాభం గారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు, అనుచరులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, ఈ లోటును భరించే మనోధైర్యాన్ని దేవుడు ప్రసాదించాలని ఆకాంక్షించారు.

