ఆత్మకూరు, ఆగస్టు 23 (పున్నమి ప్రతినిధి): తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, ఆత్మకూరు నియోజకవర్గ మాజీ ఇన్‌చార్జ్ గూటూరు మురళీకన్నబాబు జన్మదిన వేడుకలను ఆదివారం ఆత్మకూరు పట్టణంలో ఆయన అభిమానులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు.
పట్టణంలోని బస్‌స్టాండ్ సమీపంలో గల అన్నా క్యాంటీన్ ఆవరణలో నిర్వహించిన వేడుకల్లో అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారీగా బాణాసంచా కాల్చి సందడి చేశారు. అనంతరం భారీ కేక్‌ను కట్ చేసి, ఒకరికొకరు తినిపించుకుంటూ “కన్నబాబు జిందాబాద్” అంటూ నినాదాలు చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించి పలువురికి భోజనం అందించారు.
ఈ సందర్భంగా పలువురు టీడీపీ నాయకులు మాట్లాడుతూ.. ఆత్మకూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ బలోపేతానికి గూటూరు మురళీకన్నబాబు చేసిన సేవలను కొనియాడారు. పార్టీ కోసం ఆయన చేసిన కృషి, కార్యకర్తలకు అందించిన సహకారం, ప్రజా సమస్యల పరిష్కారానికి చేసిన ప్రయత్నాలను గుర్తు చేసుకున్నారు. కన్నబాబుకు భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు, విజయాలు దక్కాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ మాజీ జిల్లా ఉపాధ్యక్షుడు చండ్రా వెంకటసుబ్బానాయుడు, మంతు వెంకటేశ్వర రెడ్డి, పయ్యావుల ప్రభాకర్ నాయుడు, తలచిరు సుబ్బరాయుడు, పచ్చా వెంగయ్య నాయుడు, మొగల్ యస్. దాని, కొండా ఓంకార్, ప్రతాప్ రెడ్డి, నరేష్, సుభాహాని, చెన్నయ్య గౌడ్, పుట్టుపల్లి రంతుల్లా, షేక్ సాబ్జాన్, ప్రసాద్, విజయ్‌తో పాటు కన్నబాబు అభిమానులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.



