తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్ జిల్లాలోని బాల్కొండ మండల కేంద్రంలో ఉన్నటువంటి చిత్తాపూర్ గ్రామంలో లింగన్న పాటిల్,పుత్రుడు వెంకటేష్ గౌడ,సంఘం సభ్యులకు రేణుక ఎల్లమ్మ గుడి కోసం తన సొంత స్థలాన్ని కేటాయించడం జరిగిందనీ తెలియజేశారు.
వెంకటేష్ గారికి రేణుక ఎల్లమ్మ ఆశీస్సులు ఉండాలని సంఘ సభ్యులు ప్రజలు అందరూ కోరుకున్నారు అదేవిధంగా ఆయనకు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆయన కుటుంబం సుఖసంతోషాలతో ఉండాలని రేణుక ఎల్లమ్మ ఆశీస్సులు ఉండాలని గౌడ సంఘం సభ్యులు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయనకు గౌడ సంఘం సభ్యులు ఘనంగా సన్మానించారు.



