Tuesday, 29 September 2026

Tag: ఆర్మూర్

నిజామాబాద్

న్యూజిలాండ్‌లో ఉన్నత విద్యా అవకాశాలు, ప్రయోజనాలపై క్షత్రియ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్‌లో ప్రత్యేక అతిథి ఉపన్యాసం,

చేపూర్: క్షత్రియ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్‌లో ఆక్సానో ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ ఆధ్వర్యంలో “న్యూజిలాండ్‌లో ఉన్నత విద్యా అవకాశాలు మరియు ప్రయోజనాలు” అనే అంశంపై ప్రత్యేక అతిథి ఉపన్యాస కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం కళాశాల సెమినార్ హాల్‌లో ఉదయం 11:30 గంటల నుంచి మధ్యాహ్నం 1:00 గంటల వరకు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆక్సానో ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీకి చెందిన ఇస్తర్ దార మేడమ్ ముఖ్య వక్తగా హాజరై విద్యార్థులకు న్యూజిలాండ్‌లో ఉన్నత విద్యకు సంబంధించిన పలు అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఇస్తర్ దార మేడమ్ మాట్లాడుతూ, న్యూజిలాండ్‌లో అందుబాటులో ఉన్న ఉన్నత విద్యా అవకాశాలు, వివిధ విద్యా సంస్థలు, కోర్సులు, విద్యా విధానం, ప్రవేశ ప్రక్రియ, కెరీర్ అవకాశాలు మరియు ఉన్నత విద్య అనంతరం లభించే అవకాశాల గురించి విద్యార్థులకు వివరించారు. విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులు ముందుగానే సరైన ప్రణాళిక రూపొందించుకుని, అవసరమైన నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డా. కట్కం శ్రీనివాస్ గారు మాట్లాడుతూ, నేటి పోటీ ప్రపంచంలో విద్యార్థులు కేవలం ఇంజనీరింగ్ విద్యకే పరిమితం కాకుండా, ఉన్నత విద్య మరియు అంతర్జాతీయ విద్యా అవకాశాలపై కూడా అవగాహన కలిగి ఉండాలని అన్నారు. న్యూజిలాండ్‌లో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు అక్కడి విశ్వవిద్యాలయాలు, వివిధ కోర్సులు, విద్యా విధానం, కెరీర్ అవకాశాలు మరియు ఉన్నత విద్య అనంతరం లభించే అవకాశాలపై ఈ అతిథి ఉపన్యాసం ద్వారా విలువైన సమాచారం అందిందని తెలిపారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ భవిష్యత్ కెరీర్‌కు సరైన ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా కళాశాల సెక్రటరీ మరియు కరెస్పాండెంట్ శ్రీ అల్జాపూర్ దేవేందర్ గారు మాట్లాడుతూ, విద్యార్థులు ప్రపంచ స్థాయి విద్యను అందిపుచ్చుకుని అంతర్జాతీయ స్థాయిలో తమ ప్రతిభను నిరూపించుకోవడానికి ఇటువంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని అన్నారు. విదేశాల్లో ఉన్నత విద్యకు సంబంధించిన అవకాశాలు, అవసరమైన నైపుణ్యాలు మరియు కెరీర్ మార్గాలపై విద్యార్థులకు అవగాహన కల్పించడం కళాశాల ప్రధాన లక్ష్యాలలో ఒకటని తెలిపారు. న్యూజిలాండ్‌లో ఉన్నత విద్యా అవకాశాలపై నిర్వహించిన ఈ అతిథి ఉపన్యాసాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవడం అభినందనీయమని అన్నారు. ఈ సందర్భంగా కళాశాల శిక్షణ మరియు నియామకాల అధికారి (టీపీఓ) శ్రీ సునీల్ గటడి గారు మాట్లాడుతూ, ఈ కార్యక్రమానికి రెండవ, మూడవ మరియు నాల్గవ సంవత్సరం బీ.టెక్ విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారని తెలిపారు. విద్యార్థులు ఎంతో ఆసక్తిగా పాల్గొని న్యూజిలాండ్‌లోని ఉన్నత విద్యా అవకాశాలు, విద్యా విధానం, కెరీర్ అవకాశాలు మరియు ప్రయోజనాలపై విలువైన సమాచారాన్ని తెలుసుకున్నారని అన్నారు. ఈ అతిథి ఉపన్యాసం విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా నిలిచిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, సిబ్బంది మరియు రెండవ, మూడవ, నాల్గవ సంవత్సరం బీ.టెక్ విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

నిజామాబాద్

స్పీకర్ గారి పట్ల మాట్లాడిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తునాం -జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాట్ పల్లి నగేష్ రెడ్డి…

ఈరోజు నిజామాబాదు రూరల్ నియోజకవర్గం డిచ్ పల్లి మండల కేంద్రంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నగేష్ రెడ్డి గారు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా నగేష్ రెడ్డి గారు మాట్లాడుతు అసెంబ్లీ సమావేశం సందర్బంగా brs నాయకులు అసెంబ్లీ స్పీకర్ పట్ల వ్యవహరించిన తీరును జిల్లా కాంగ్రెస్ పార్టీ తరుపున తీవ్రంగా ఖండిస్తున్నం.BRS నాయకులు నల్ల టీ షర్ట్ ధరించి వాటి పైన ప్రభుత్వానికి వ్యతిరేకంగా తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారని, మహిళ పోలీసుల ముందు టీ షర్ట్స్ విప్పి అసభ్యకరంగా ప్రవర్తించారని, నిన్నటి ఘటన తెలంగాణ కి చీకటి రోజన్నారు.కెసిఆర్ గారు ఏ ఒక్క రోజు కుడా అసెంబ్లీకి రాలేడని,ఆయన మీద దాదాపు 22కోట్ల వరకు ప్రజ ధనం వృధా చేసారని దీనికి brs నాయకులు సమాధానం చెప్పాలన్నారు.కాంగ్రెస్ పార్టీ అనేక సంక్షేమ ఫలాలు అందిస్తుంటే విమర్శలు చేస్తున్నారని, ప్రతి పక్ష నాయకులు విమర్శలు మాని ప్రభుత్వానికి సూచనలు ఇస్తే స్వీకరిస్తామన్నారు.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక మహిళలకు ఉచిత బస్సు, 200యూనిట్ల ఉచిత విద్యుత్,రేషన్ కార్డులు, రైతు భరోసా, రైతు రుణ మాఫీ, జిల్లాకు 4ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, ఇంజనిరింగ్ కాలేజీ, అగ్రికల్చర్ కాలేజీ తెచ్చిన ఘనత తమ ప్రభుత్వానిదన్నారు.ఇప్పటికయినా brs నాయకులు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించబొమని brs ఎమ్మెల్సీ తాత మధుపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు బాలరాజ్, గాదారి గోపి, జిల్లా ST సెల్ అధ్యక్షులు యాదగిరి,జిల్లా ప్రధాన కార్యదర్శి బున్నే రవి, జిల్లా కార్యదర్శి గణేష్, సర్పంచ్ శ్రీను, నర్సయ్య, గంగారెడ్డి, మధు, అశోక్, శ్రీనివాస్, నరేందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. Uploaded Video:

నిజామాబాద్

ఆలూర్‌లో తాత మధు ఎమ్మెల్సీ దిష్టిబొమ్మ దగ్ధం*

ప్రజాస్వామ్యానికి దేవాలయంగా భావించే అసెంబ్లీ సాక్షిగా దళిత స్పీకర్‌ను కుల అహంకారంతో పరుష పదజాలంతో దూషించడం అత్యంత సిగ్గుచేటని కాంగ్రెస్ పార్టీ నాయకులు మండిపడ్డారు. ఈరోజు ఆలూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు దేగాం ప్రమోద్ ఆధ్వర్యంలో తాత మధు ఎమ్మెల్సీ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఆయన దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, అసెంబ్లీ వంటి అత్యున్నత ప్రజాస్వామ్య వేదికలో స్పీకర్‌పై వ్యక్తిగతంగా, కులాన్ని ఉద్దేశించి అవమానకరమైన వ్యాఖ్యలు చేయడం తీవ్రంగా ఖండించదగిన చర్య అన్నారు. దళిత స్పీకర్‌ను అవమానించిన ఘటనపై సమగ్ర విచారణ జరిపి, చట్టపరంగా తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సంబంధిత చట్టాల ప్రకారం కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. నీతులు చెప్పే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తన పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను రెచ్చగొట్టే విధంగా వ్యవహరించడం ద్వారా రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే పరిస్థితులు సృష్టించడం ఆయన స్థాయికి తగదని విమర్శించారు. రాజకీయ విభేదాలను పక్కనపెట్టి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆలూర్ గ్రామ సర్పంచ్ ముక్కెర విజయ్, ఏఎంసీ డైరెక్టర్ మల్లారెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు బార్ల ముత్యం, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు తలారి రాకేష్, సమీర్, ఎన్‌ఎస్‌యూఐ శేషి, గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు యాదగౌడ్, ప్రభాకర్, ప్రశాంత్, శ్రీనివాస్ గౌడ్, నవనీత్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

నిజామాబాద్

గణేష్ మండలి నిర్వాహకులు తప్పకుండా నిబంధనలు పాటించాలి: పోలీస్ కమిషనర్ వెల్లడి*

*డి.జేలకు ఎలాంటి అనుమతులు లేవు పూర్తిగా నిషేధం* *మండపం వద్ద విధ్యుత్ తీగలతో జాగ్రత్తలు పాటించాలి* *వర్షం సందర్భంగా మండపంపైన పాల్దిన్ కవర్స వాడాలి* *రాత్రి 10 గంటలకు లౌడ్ స్పీకర్లు ఆఫ్ చేయాలి* *భారీ విగ్రహాలను తీసుకువెళ్లే సమయంలో తగు జాగ్రత్తలు పాటించాలి* 1) గణేష్ విగ్రహ ఏర్పాటు కోసం ప్రజల నుండి డబ్బులను బలవంతంగా వసూలు చేయరాదు. గణేష్ మండపాలను ఎవరికి,ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేసుకోవాలి. మండపం ఏర్పాటు చేసే స్థలం కోసం సంబంధిత శాఖల వారికి సమాచారం ఇవ్వవలెను. 2) గణేష్ మండళ్ల వద్ద సందర్శించే మహిళలపై, యువతులపై” ఈవ్ టీజింగ్” జరుగకుండా చూడవలెను. 3) ప్రజలకు అసౌకర్యం కలుగకుండా డి.జె / డి.జె మిక్సర్స్ / హైఫిడిలిటి ( హైఫై ) సౌండ్స్సిస్టమ్ ఇక్విప్మెంటు విషయంలో చాలా జాగ్రతలు వహించాలి. కొద్ది మంది ఇండ్లలో గుండె జబ్బులు గలవారు, బి.పి గలవారు, వయసు పై బడిన వృద్దులు ఉంటారు. మరియు చదువుకునే విద్యార్థులకు ఆటంకము కలుగ కుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇట్టి సౌండ్ 12 Decibels దాటి ఉండరాదు. 4) రాత్రి 10-00 గంటలకు ” లౌడ్ స్పీకర్లు” ఆఫ్ చేయాలి. ఈ విషయంలో సుప్రీంకోర్టు నిబంధనలను పాటించాలి. లేని యెడల చట్టరిత్య చర్యలు తీసుకొనబడును. 5) డి.జే లు పూర్తిగా నిషేదం తీసుకోవాలి. మైక్ పర్మీషన్ కోసం సంబంధిత ఎ.సి.పి ని సంప్రదించి తప్పని సరిగా పర్మిషన్ తీసుకోవాలి. 6) విధ్యుత్ సరఫరా ఆగకుండా వీధి దీపాలు వెలిగేటట్లు చూడవలెను. షార్టు సర్కూట్ జరుగకుండా మంచి నాణ్యత గల వైరు ను ఉపయోగించాలి. ప్రతీ చోట ఎమ్.సి.బి ఏర్పాటు చేయాలి. 7) ప్రజలకు అసౌకర్యం కలుగజేసే ఎటువంటి చిన్న సమాచారాన్ని అయిన మీ దగ్గరలోని పోలీసులకు తెలుపండి. లేదా డయల్ 100 కు ఫోన్ చేయగలరు లేదా పోలీస్ కంట్రోల్ రూమ్ నెంబర్: 87126- 59700 కు తెలపాగలరు. 8) ప్రతీ గణేష్ మండలి వద్ద ఉదయం వేళలో మరియు రాత్రి వేళలో ఇద్దరూ లేదా ముగ్గురికి తక్కువ కాకుండా తమ కమిటీ మెంబర్ల ను మండలి వద్ద ఉంచవలెను. పోలీస్ వారు చెకింగ్ కు వచ్చినప్పుడు ప్రతీసారి కనబడవలెను. మండపము దగ్గర అసాంఘిక చర్యలు లేకుండా చూసుకోనవలయును. 9) ప్రతి గణేష్ మండలి దగ్గర విధిగా పాయింట్ పుస్తకం ఏర్పాటు చేసుకోవాలి. పోలీసు అధికారుల తనిఖీకి వచ్చినప్పుడు అందులో వ్రాసి సంతకం చేస్తారు. 10) ” అపరిచిత ” వ్యక్తుల గూర్చి సమాచారం తెలియజేయాలి. 11) మీ దగ్గరలో ఎవ్వరయిన అనుమానస్పదంగా బ్యాగులు, ప్లాస్టిక్ సంచూలు వదిలినట్లయితే వాటిని తాకరాదు. అట్టి సమాచారం దగ్గరలోని పోలీస్ అధికారులకు తెలుపండి. 12) గణేష్ మండలి మొక్క పూర్తి వివరములు నిమజ్జనం కొరకు ఏ రోజు ఎక్కడికి ఏ మార్గం ద్వారా తీసుకు వెళ్తారనే సమాచారం సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులకు ముందుగానే తెలుపండి. 13) గణేష్ ప్రతిమలు కూర్చుండబెట్టే ప్రదేశంలో షెడ్ నిర్మాణంలో మంచి నాణ్యత గల షెడ్ ఏర్పాటు చేయవలెను . ( పై భాగంలో రేకులు, ప్లాస్టిక్ కవర్లతో ఏర్పాటు చేయాలి. వర్షపు నీరులోపలికి రాకుండా ఉండడం కోసం ) 14) గణేష్ ప్రతిమలు కూర్చుండబెట్టే వేదిక చాలా బలంగా ఉండేటట్లు చూసుకోవాలి. మేకలు, ఇతర జంతువులు రాకుండా తగు జాగ్రత్తలు తీసికోవాలి. 15) గణేష్ మండలి వద్ద పూజా కార్యాక్రమంలో ” క్యూ ” పద్దతి పాటించాలి. “బారికేడ్లను ” విధిగా ఏర్పాటు చేసుకోవాలి. 16) ప్రత్యేకంగా లైటింగ్ సౌకర్యం కోసం మంచి నాణ్యత గల వైరు తో ప్లాస్టిక్ పి.వి.సి పైప్ ద్వారా లైటింగ్ సౌకర్యాలు ఏర్పాటు చేసుకోవాలి. పూర్తి సురక్షితమైన కవరుతో ఉన్న ఫడ్లైట్లను మాత్రమే వాడాలి. 17) గణేష్ మండళ్ల వద్ద ఏప్పుడైన అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు ముందు జాగ్రత్తలో భాగంగా దగ్గరలో రెండు బకెట్ల నీళ్లు, రెండు బకెట్ల ఇసుక ఏర్పాటు చేసుకోవాలి, మరియు ఫైర్ బాల్స్ సమకూర్చుకోవాలి. 18) యువకులు కోపతాపాలకు వెళ్లకుండా ” సంయమనం” పాటించే విధంగా చర్యలు తీసుకోవాలి. 19) ఎటువంటి ” రూమర్స్ (పుకార్ల) ను నమ్మరాదు. 20) ప్రజలకు అసౌకర్యం కలుగ కుండా నిరంతర పోలీస్ నిఘా ఏర్పాటు చేయబడింది. 21) సంబంధిత నిర్వాహకులు అవసరం నిమిత్తం ఉపయోగించుట కొరకు మీ దగ్గరలోని పోలీస్ సిబ్బంది ఫోన్ నెంబర్లను వ్రాసి పెట్టు కోనగలరు. 22) వీలైనంతవరకు మట్టి మరియు తక్కువ ఎత్తుగల గణపతులను ప్రోత్సాహించండి. పర్యావరణాన్ని కాపాడండి. 23) నిర్వాహాకులు మండపాలదగ్గర వచ్చే భక్తులను “క్యూ”లో నిలబెట్టవలెను. వారి వాహానాలను పద్దతి ప్రకారంగా పార్కింగ్ చేయించవలెను. 24) గణేష్ భక్తులు, నిర్వాహకులు మద్యపానానికి దూరంగ ఉండవలెను. 25) గణేష్ మండళ్ల వద్ద” పేకాట ఆడరాదు. 26) గణేష్ ఉత్సవాలలో” టపాసుల” నిషేదం గలదు. 27) నిమజ్జనం రోజు పోలీసు వారు జారీ చేసిన నియమ నిబంధనలు పాటిస్తూ విగ్రహాన్ని (రథాన్ని) “క్యూ” లో ఉండే విధంగా చర్యలు తీసుకోగలరు. 28) ప్రతీ రధనికి లైటింగ్ సౌకర్యం ఏర్పాటు చేసుకోవాలి. 29) నిమజ్జనం రోజు వీలయినంత వరకు చిన్న పిల్లలు ఉండకుండా చూసుకోవాలి. 30) ఎక్కువ జనసమూహం ఉన్నప్పుడు “దొంగతనాలకు ఆస్కారము ఎక్కువగా ఉంటుంది. కాబట్టి చిల్లర దొంగల పై జాగ్రత్త వహించాలి. 31) నిమజ్జనం రోజు భజన కార్యక్రమం చేసేవారు సంబంధిత దాన్ని అనుకరిస్తూ భక్తి భావంతో మెలుగవలెను. పర్మీషన్ తీసుకొనవలెను. 32) నిమజ్జనం రోజు వారి వారి అనుకూలనుసారం” బావులలో చెఱువులలో కాలువలలో లేదా గోదావరిలో మొదలగు చోట్ల వేసేటప్పుడు పెద్దవారు మాత్రమే ముందుకు వెళ్లి విగ్రహన్ని వేయాలి. ప్రత్యేకంగా ఈత వచ్చిన వారు ఉండవలెను. పోలీస్ వారి సూచనల మేరకు నిమజ్జనం చేయవలను. 33) నిమజ్జనం రోజు కొన్ని ప్రాంతాలలో చిన్న పిల్లలు వెల్లడం జరుగుతుంది. అలా కాకుండా ప్రతీ గణేష్ నీ నిమజ్జనం చేసే రోజు తప్పక పెద్దవాళ్లు ఉండవలెను. ప్రతీ ఒక్కరు జాగ్రత్తగా వెళ్లి జాగ్రత్తగా ఇంటికి చేరుకోవలెను. 34) కొన్ని మారుమూల గ్రామాలలోని ప్రజలు గ్రామ శివారులో గల చెఱువులో లేదా నీటి గుంతలలో గణేష్ నిమజ్జనం చేయాడానికి ప్రయత్నిస్తారు. అటువంటి వాటిలో గతంలోనే ప్రొక్లేన్స్” ద్వారా పెద్ద పెద్దగా మట్టి తీసివేయడం వలన అక్కడ నీరు ఎక్కువగా నిల్వ ఉన్నా కాని కొద్దీగా ఉన్నట్లు కనబడును. కావున ఇటువంటి ప్రదేశాలలో సంబందిత పెద్ద వారు సరియైన జాగ్రత్తలు తీసుకోవాలి. 35) అవసరానుకూలంగా సి.సి కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి. 36) నిమజ్జనంచేసే సమయంలో ఎవ్వరు కూడా విన్యాసాలు చేయకూడదు. సెల్ఫోన్తో సెల్ఫీలు దిగవద్దు. 37) వినాయక విగ్రహం తీసుకొని వచ్చే రోడ్డులో కానీ వినాయక విగ్రహం తీసుకొని వెళ్లే రూటులో కానీ ఎంత ఎత్తు గలదో అట్టి దారి పొడవున ముందుగానే చూసుకోవాలి. ఎక్కడ ఎలాంటి ప్రమాదము జరగకుండా ముందుగానే అన్ని రకాల జాగ్రత్తలు పాటించవలెను. 38. ప్రజలు పోలీసులకు ఎల్లప్పుడు సహకరించవలెను.

నిజామాబాద్

ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణికి ఏడు ఫిర్యాదులు

నందిపేట్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి ఏడు ఫిర్యాదులు అందాయి. వివిధ గ్రామాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ అర్జీలను ఎంపీడీవో కార్యాలయ సూపరింటెండెంట్ అశోక్ కు అందజేశారు. ఆయన మాట్లాడుతూ పంచాయతీరాజ్ శాఖ నుండి రెండు ఫిర్యాదులు, రెవెన్యూ శాఖ నుండి ఒకటి, హౌసింగ్ శాఖ నుండి నాలుగు ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని మండల ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

నిజామాబాద్

బంగారు కమ్మల కోసం వృద్ధురాలిపై దాడి* *_ఇంట్లో ఒంటరిగా నిద్రిస్తున్న 70 ఏళ్ల మహిళకు గాయాలు.. కత్తెరతో చెవులకు గాయం చేసి ఆభరణాల అపహరణ_*

నిజామాబాద్, సెప్టెంబర్‌ 7: బంగారు ఆభరణాల కోసం ఓ దుండగుడు వృద్ధురాలిపై దాడికి పాల్పడిన ఘటన నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని గౌతమ్‌నగర్‌లో చోటుచేసుకుంది. ఇంట్లో ఒంటరిగా నిద్రిస్తున్న 70 ఏళ్ల వృద్ధురాలిని లక్ష్యంగా చేసుకున్న దుండగుడు బంగారు కమ్మలను అపహరించేందుకు ప్రయత్నించాడు. అవి రాకపోవడంతో ఆమె చెవులకు కత్తెరతో గాయపరిచి కమ్మలను లాక్కెళ్లాడు. స్థానికుల కథనం ప్రకారం.. ఆదివారం అర్ధరాత్రి సమయంలో దుండగుడు ఇంట్లోకి చొరబడ్డాడు. నిద్రిస్తున్న వృద్ధురాలి చెవుల నుంచి బంగారు కమ్మలను తీసేందుకు ప్రయత్నించాడు. కమ్మలు రాకపోవడంతో కత్తెరతో చెవులకు గాయపరిచి వాటిని బలవంతంగా తీసుకుని అక్కడి నుంచి పరారైనట్లు తెలుస్తోంది. వృద్ధురాలి కేకలు విన్న స్థానికులు అప్రమత్తమై పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని పరిశీలించి, గాయపడిన వృద్ధురాలిని చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తూ దుండగుడి ఆచూకీ కోసం గాలింపు చేపట్టినట్లు తెలిసింది. అర్ధరాత్రి ఒంటరిగా ఉన్న వృద్ధురాలిపై దాడి జరగడంతో గౌతమ్‌నగర్‌లో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడికావాల్సి ఉంది.

నిజామాబాద్

ముందస్తు అరెస్టులను ఆమ్ ఆద్మీ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గం ఖండించింది…

ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర పిలుపు మేరకు ఈరోజు అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం జరుగుతోంది. ఓ, మంత్రిని నియమించాలని, శిరీషకు న్యాయం చేయాలని ధర్నా కార్యక్రమం జరుగుతుండగా, అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం కారణంగా ముందస్తుగా అరెస్టు చేశారు. ఈ అక్రమ అరెస్టులతో భయపడాల్సిన పనిలేదు. సీఎం రేవంత్ రెడ్డి అనేక శాఖలను తన వద్దే ఉంచుకుని, పరిపాలనను ప్రజల ఇష్టానికి వదిలేస్తున్నారు. అందువల్ల, ఆయన ఆధీనంలో ఉన్న శాఖలను తక్షణమే నియమించాలని ఆమ్ ఆద్మీ పార్టీ డిమాండ్ చేస్తోంది. రాష్ట్రమంతటినీ అరెస్టు చేసినా సరే, మా ఆప్ కార్యకర్తలను విడుదల చేయాలి. లేకపోతే, ఆడపిల్లలకు రక్షణ కల్పించని ప్రభుత్వం వెంటనే సీఎం ఆధీనంలో హోం శాఖను నియమించాలని డిమాండ్ చేస్తూ మేము పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతాము. హోం శాఖను నియమించే వరకు మా పార్టీ పోరాటం కొనసాగిస్తుంది. నిరుద్యోగ యువతకు రెండు లక్షల మంది ఉద్యోగులను నియమించే వరకు మా పార్టీ పోరాటం కొనసాగిస్తుంది. సయ్యద్ అవేజ్, ఆమ్ ఆద్మీ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్‌చార్జ్.

నిజామాబాద్

నందిపేట్ మండలంలో వార్డ్ మెంబర్ నూతనంగా కమిటీ ఎన్నిక

నందిపేట్ మండల కేంద్రంలో ఆదివారం నూతనంగా వార్డ్ మెంబర్ అసోసియేషన్ కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. నూతన అధ్యక్షులుగా గజ్జి రాజేందర్, ఉపాధ్యక్షులుగా మాణిక్యం శ్రీకాంత్, క్యాషియర్ గా ఎస్కే అఫ్రోజ్, ప్రధాన కార్యదర్శిగా గంధం గంగాధర్, కార్యదర్శిగా ఎర్రటి సందీప్, గౌరవ సలహాదారులుగా మహమ్మద్ షారుక్ ఖాన్, సాంబారు పద్మాకర్, మేకల వినోద్ లను ఎన్నుకున్నారు.

నిజామాబాద్

బాధ్యత కుటుంబానికి అండగా ఈ ఆర్ ఫౌండేషన్ చైర్మన్

ఆలూరు మండల కేంద్రానికి చెందిన కాచర్ల మోహన్ ఇటీవల దుబాయిలో మరణించడం బాధాకరమని ER ఫౌండేషన్ చైర్మన్ ఈరవత్రి రాజశేఖర్ అన్నారు. శనివారం ఆయన ఆలూరు మండల కేంద్రంలో బాధిత కుటుంబ సభ్యులను వారి నివాసానికి వెళ్లి పరామర్శించారు. బాధిత కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబ సభ్యులకు అండగా ఉంటామన్నారు. బాధిత కుటుంబానికి తన వంతు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. అలాగే అదే గ్రామానికి చెందిన కాచర్ల శ్రీనివాస్ కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. శ్రీనివాస్ ఈ మధ్యన మృతి చెందడం బాధాకరమని పేర్కొన్నారు. బాధిత కుటుంబ సభ్యులకు అండగా ఉంటామన్నారు. బాధిత కుటుంబ సభ్యులకు తన వంతుగా ఆర్థిక సహాయం అందజేశారు. ఆయన వెంట ER ఫౌండేషన్ సభ్యులు వినోద్, దినేష్, ఇమ్రాన్, సాయి చరణ్, తదితరులు పాల్గొన్నారు.

నిజామాబాద్

రాఖీ పౌర్ణమి సందర్భంగా పద్మశాలి సంఘం ఘనంగా వేడుకలు,

నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం అయిలాపూర్ గ్రామ లో రాఖీ పౌర్ణమి సందర్భంగా మార్కండేయ పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి కుల బాంధవులు అందరూ హాజరై రాఖీ కట్టుకుని జంజిరా లు వేసుకుని వేడుకున్నారు, కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు గొనె కృష్ణ ఉపాధ్యక్షులు గుల్లే బాలా కృష్ణ, కార్యదర్శి సంతోష్, ఉప కార్యదర్శి పిస్కా ప్రకాష్, కోశాధికారి చిక్కెల నవీన్, సలహాదారులు, అవధూత నర్సయ్య, జీవన్, వెంకటేష్, సాయిలు, బాడీ మెంబర్స్, రిపోర్ట్ చిక్కెల నరేష్ తదితరులు పాల్గొన్నారు…. Uploaded Video:

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.