నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం అచ్చమాంబ ఆలయం సమీపంలో నెల్లూరు-ముంబయి జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున బొగ్గు లోడుతో వెళ్తున్న లారీ అదుపుతప్పి కల్వర్టును ఢీకొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో లారీ ముందు భాగం, టైర్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. అయితే ఎదురుగా ఎటువంటి వాహనాలు రాకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని, డ్రైవర్ సురక్షితంగా బయటపడ్డాడని పోలీసులు తెలిపారు. రహదారిపై లారీ అడ్డంగా నిలిచిపోవడంతో కొద్దిసేపు రాకపోకలకు స్వల్ప అంతరాయం ఏర్పడింది.

మర్రిపాడులో తప్పిన పెను ప్రమాదం: కల్వర్టును ఢీకొన్న బొగ్గు లారీ!