Friday, 26 June 2026
  • Home  
  • డ్రగ్స్‌కు దూరంగా ఉండి భవిష్యత్తును నిర్మించుకోండి
- News - ఆంధ్రప్రదేశ్ - శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

డ్రగ్స్‌కు దూరంగా ఉండి భవిష్యత్తును నిర్మించుకోండి

విద్యార్థులకు ఎక్సైజ్ అధికారుల పిలుపు ఆత్మకూరు (హరికిరణ్, పున్నమి ప్రతినిధి): ప్రపంచ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఆత్మకూరు ప్రొహిబిషన్ & ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో ప్రియదర్శిని జూనియర్ కళాశాలలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. మాదక ద్రవ్యాల వినియోగం యువత భవిష్యత్తును నాశనం చేస్తుందని, డ్రగ్స్‌కు దూరంగా ఉంటూ ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకోవాలని సూచించారు.విద్యార్థి దశలో మంచి అలవాట్లు పెంపొందించుకోవడం ఎంతో ముఖ్యమని, చెడు అలవాట్లకు ఆకర్షితులైతే చదువు, ఆరోగ్యం, కుటుంబ జీవితం తీవ్రంగా ప్రభావితమవుతాయని వివరించారు.మాదక ద్రవ్యాల నియంత్రణలో యువత భాగస్వామ్యం అవసరమని, డ్రగ్స్ వినియోగం, విక్రయం, రవాణా వంటి అనుమానాస్పద కార్యకలాపాలపై వెంటనే అధికారులకు సమాచారం అందించాలని తెలిపారు.మాదక ద్రవ్యాల తయారీ, సరఫరా, వినియోగంపై చట్టపరమైన చర్యలు కఠినంగా ఉంటాయని, యువత చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని అధికారులు వివరించారు.ప్రతి విద్యార్థి క్రీడలు, విద్య, సృజనాత్మక కార్యక్రమాల వైపు దృష్టి సారించి ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని కోరారు. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ప్రొహిబిషన్ & ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం.వి.కృష్ణారావు, సబ్ ఇన్స్పెక్టర్ వై.గౌతమ్, కళాశాల విద్యార్థులు, ఎక్సైజ్ సిబ్బంది పాల్గొన్నారు.

విద్యార్థులకు ఎక్సైజ్ అధికారుల పిలుపు

ఆత్మకూరు (హరికిరణ్, పున్నమి ప్రతినిధి):

ప్రపంచ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఆత్మకూరు ప్రొహిబిషన్ & ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో ప్రియదర్శిని జూనియర్ కళాశాలలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. మాదక ద్రవ్యాల వినియోగం యువత భవిష్యత్తును నాశనం చేస్తుందని, డ్రగ్స్‌కు దూరంగా ఉంటూ ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకోవాలని సూచించారు.విద్యార్థి దశలో మంచి అలవాట్లు పెంపొందించుకోవడం ఎంతో ముఖ్యమని, చెడు అలవాట్లకు ఆకర్షితులైతే చదువు, ఆరోగ్యం, కుటుంబ జీవితం తీవ్రంగా ప్రభావితమవుతాయని వివరించారు.మాదక ద్రవ్యాల నియంత్రణలో యువత భాగస్వామ్యం అవసరమని, డ్రగ్స్ వినియోగం, విక్రయం, రవాణా వంటి అనుమానాస్పద కార్యకలాపాలపై వెంటనే అధికారులకు సమాచారం అందించాలని తెలిపారు.మాదక ద్రవ్యాల తయారీ, సరఫరా, వినియోగంపై చట్టపరమైన చర్యలు కఠినంగా ఉంటాయని, యువత చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని అధికారులు వివరించారు.ప్రతి విద్యార్థి క్రీడలు, విద్య, సృజనాత్మక కార్యక్రమాల వైపు దృష్టి సారించి ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని కోరారు. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ప్రొహిబిషన్ & ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం.వి.కృష్ణారావు, సబ్ ఇన్స్పెక్టర్ వై.గౌతమ్, కళాశాల విద్యార్థులు, ఎక్సైజ్ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.