పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలి
ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర సహాయ కార్యదర్శి మంద శ్రీకాంత్
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ లోను విడుదల చేయాలని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఎఫ్ఐ భారత విద్యార్థి ఫెడరేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా కలెక్టరేట్ ఎదుట నిరసన తెలియజేయడం జరిగింది ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర సహాయ కార్యదర్శి మంద శ్రీకాంత్ హాజరై మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 10481 కోట్ల రూపాయలు పెండింగ్ లో ఉన్నాయని తక్షణమే వాటిని విడుదల చేయాలని అన్నారు అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం సుమారు మూడు సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ యావత్తు విద్యార్థులంతా కాంగ్రెస్ రావాలి మార్పు రావాలి అని కాంగ్రెస్ మేనిఫెస్టోలో విద్యార్థులకు తక్షణమే స్కాలర్షిప్లు విడుదల చేస్తామని విద్యార్థులను మభ్యపెట్టి ఇప్పుడు విద్యార్థుల ప్రాణాలతో కాంగ్రెస్ ప్రభుత్వం చెలగాటమాడుతుందని అన్నారు కళాశాలలో విద్యార్థుల పై చదువుల కోసం సర్టిఫికెట్లు అడిగితే యాజమాన్యాలు విద్యార్థులను ముప్పు తిప్పలు పెడుతున్న పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉందని అన్నారు
*ఎస్ఎఫ్ఐ వరంగల్ జిల్లా కార్యదర్శి పైసా గణేష్* మాట్లాడుతూ వరంగల్ జిల్లా వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని అన్నారు అదేవిధంగా కళాశాల యాజమాన్యాలను విద్యార్థులను ఇబ్బంది పెట్టకుండా సర్టిఫికెట్లు వారి పై చదువుల కోసం ఇవ్వాలని కోరారు లేనియెడల భారత విద్యార్థి పరిషత్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని అన్నారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ వరంగల్ జిల్లా అధ్యక్షుడు బానోతు వినోద్ కుమార్ ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు వసీం ఎస్ఎఫ్ఐ నాయకులు రవీందర్ అరుణ్ సురేందర్ సురేష్ పవన్ ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు


