పోలవరం ప్రాజెక్టు ఎడమ కాలువ ద్వారా గోదారమ్మ ఉత్తరాంధ్రవైపు పరుగులు పెట్టనుంది. నాలుగు నదుల్ని దాటుకుంటూ … తూర్పు కనుమల్లో దారి చేసుకుంటూ గోదారి ఉత్తరాంధ్ర ప్రాంతానికి కదలి రానుంది. రేపు అనకాపల్లి జిల్లా పాయకరావుపేట వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలవరం ఎడమ కాలువ ద్వారా వచ్చిన గోదావరి జలాలకు హారతి ఇచ్చి స్వాగతం పలకనున్నారు. కాలువపై నిర్మించిన రెగ్యులేటర్ ను ఆన్ చేసి గోదావరి జలాలను ఉత్తరాంధ్రకు విడిచి పెట్టనున్నారు. రేపు మధ్యాహ్నం 2.20 గంటలకు పాయకరావుపేటకు చేరుకోనున్న ముఖ్యమంత్రి.. పోలవరం ఎడమ కాలువ ద్వారా వచ్చే జలాలకు జల హారతి ఇచ్చి నీటిని విడుదల చేయనున్నారు. అనంతరం సమీపంలోనే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.

తూర్పు కనుమల్లో దారి చేసుకుంటూ గోదారి..