ఖమ్మం: పరమహంస పరివ్రాజకాచార్యులు శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి వారి 70వ జన్మదినోత్సవ వేడుకల్లో భాగంగా ఖమ్మంలో ఏర్పాటు చేసిన శ్రీరామ హృదయ కలశ యాత్ర భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఎరనేని రామారావు ఆధ్వర్యంలో జరిగిన ఈ యాత్రలో తెలంగాణ రాష్ట్ర బీజేపీ కిసాన్ మోర్చా మాజీ అధ్యక్షులు కొండపల్లి శ్రీధర్ రెడ్డి, ఖమ్మం జిల్లా బీజేపీ మాజీ అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గల్లా సత్యనారాయణ, కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సోమగాని ఎల్లరావు గౌడ్, ముదిగొండ మండల బీజేపీ ఇంచార్జి అనంతు ఉపేందర్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామివారి సేవలు, ఆధ్యాత్మిక సందేశాలను వారు స్మరించుకున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



