ఈ నెల22,23తేదీలలో విశాఖ జిల్లాలో ప్రత్యేక ప్రచార దినాలు
మధురవాడ:
విశాఖ జిల్లాలోని 7అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఈ నెల 22 (శనివారం),23 (ఆదివారం)తేదీలలో’ప్రత్యేక ప్రచార దినాలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.ఈరెండు రోజుల పాటు ఉదయం నుంచే సంబంధిత పోలింగ్ కేంద్రాల్లో బూత్ స్థాయి అధికారులు (BLOలు)అందుబాటులో ఉంటారు.వారి వద్ద SIR-2026 ముసాయిదా ఓటర్ల జాబితా తో పాటు కొత్త ఓటరు నమోదు, సవరణలకు సంబంధించిన దరఖాస్తు ఫారాలు సిద్ధంగా ఉంటాయి.కొత్త ఓటరు నమోదు..18 సంవత్సరాలు నిండిన వారు లేదా ముసాయిదా జాబితాలో పేరు లేని అర్హులైన పౌరులు ఫారం-6 దాఖలు చేసి ఓటరుగా నమోదు చేసుకోవచ్చు.ఓటర్ల జాబితాలో పేరు, చిరునామా,ఇతర తప్పుల సవరణకు లేదా కొత్త ప్రాంతానికి నివాసం మారిన వారు వివరాల మార్పు కోసం ఫారం-8 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
జాబితాల పరిశీలన ఇంటింటి సర్వేలో వివరాలు సమర్పించని వారి జాబితాలు,Unmapped Electors,Logical Discrepancies నోటీసుల జాబితాలు బిఎల్ఓ వద్ద అందుబాటులో ఉంటాయి. ఓటర్లు తమ వివరాలను సరిచూసుకుని అవసరమైన మార్గదర్శకత్వం పొందవచ్చు.కార్యక్రమాలను EROలు,AEROలు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించనున్


