విశాఖపట్నం 27 8 2026 పున్నమి ప్రతినిధి
పల్నాడు జిల్లా చిలకలూరిపేట వద్ద తెల్లవారుజామున చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి చెందడం పట్ల రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. అధికారుల నుంచి ప్రమాద వివరాలను తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యసాయం అందించాలని స్పష్టం చేశారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. ప్రైవేటు బస్సులపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి, తనిఖీలు చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు. మృతుల కుటుంబాలను కూటమి ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని తెలిపారు



