వార్త ముఖ్యాంశాలు
- మానవత్వమే మతం..
- పేదల కర్మకాండలకు రూ.1.20 లక్షల ఆర్థిక భరోసా ఆత్మకూరు, ఆగస్టు 27 (పున్నమి ప్రతినిధి): శ్రీ సాంబశివ చారిటబుల్ ట్రస్ట్ అధినేత, నిత్యాన్నదాత కంచి పరమేశ్వర రెడ్డి మరోసారి తన ఉదారతను చాటుకున్నారు.
- ఆర్థిక ఇబ్బందులతో తమ కుటుంబ సభ్యుల కర్మకాండలు, అంత్యక్రియలు నిర్వహించలేక ఇబ్బందులు పడుతున్న పేద కుటుంబాలకు అండగా నిలుస్తూ రూ.1.20 లక్షల ఆర్థిక సహాయాన్ని చెక్కుల రూపంలో అందజేశారు.
మానవత్వమే మతం.. పేదల కర్మకాండలకు రూ.1.20 లక్షల ఆర్థిక భరోసా
ఆత్మకూరు, ఆగస్టు 27 (పున్నమి ప్రతినిధి): శ్రీ సాంబశివ చారిటబుల్ ట్రస్ట్ అధినేత, నిత్యాన్నదాత కంచి పరమేశ్వర రెడ్డి మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. ఆర్థిక ఇబ్బందులతో తమ కుటుంబ సభ్యుల కర్మకాండలు, అంత్యక్రియలు నిర్వహించలేక ఇబ్బందులు పడుతున్న పేద కుటుంబాలకు అండగా నిలుస్తూ రూ.1.20 లక్షల ఆర్థిక సహాయాన్ని చెక్కుల రూపంలో అందజేశారు.
మొత్తం 12 మంది లబ్ధిదారుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున ఆర్థిక సహాయం అందించారు. గత రెండేళ్లుగా మున్సిపాలిటీ పరిధిలోని పేద కుటుంబాలకు అందిస్తున్న ఈ సేవను, గ్రామీణ ప్రాంతాల్లోని పేదల కష్టాలను గుర్తించి ప్రస్తుతం ఆత్మకూరు మండలంలోని రూరల్ గ్రామాలకు కూడా విస్తరించారు.కరటంపాడు ఎస్సీ కాలనీకి చెందిన నలిపోగు రమణయ్య కుటుంబం, బోయల చిరివెళ్ల గ్రామానికి చెందిన పడిగిరెడ్డి మహాలక్ష్మమ్మ కుటుంబం, బసవరాజుపాలెం గ్రామానికి చెందిన పిచ్చపాటి రమణయ్య కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించారు. అలాగే ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలోని వివిధ వార్డులకు చెందిన తొమ్మిది మంది పేద కుటుంబాలకు కూడా ఈ సహాయం అందజేశారు.కుల, మతాలకు అతీతంగా పేదరికమే ప్రాతిపదికగా ప్రతి కుటుంబానికి అండగా నిలుస్తున్న కంచి పరమేశ్వర రెడ్డి సేవలను పలువురు అభినందించారు. ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులు, వారి సహాయకుల కోసం నిర్వహిస్తున్న నిత్యాన్నదాన కార్యక్రమం ద్వారా ఇప్పటికే వేలాది మంది ఆకలి తీరుస్తున్నారు.ఈ సందర్భంగా కంచి పరమేశ్వర రెడ్డి మాట్లాడుతూ, “ఆర్థిక ఇబ్బందుల వల్ల ఎవరూ తమ వారి అంత్యక్రియలు, కర్మకాండలు నిర్వహించడంలో ఇబ్బంది పడకూడదనేదే నా సంకల్పం” అని తెలిపారు.