Monday, 22 June 2026
  • Home  
  • గ్రీవెన్స్ డేలో వినతుల స్వీకరణ
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

గ్రీవెన్స్ డేలో వినతుల స్వీకరణ

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జూన్ 22 ( పున్నమి ప్రతినిధి) మనుబోలు మండల రెవెన్యూ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ డేలో ప్రజల నుంచి పలు వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో జలజాక్షి, ఉప తహసీల్దార్ ప్రదీప్ కుమార్ మాట్లాడుతూ ప్రజలు సమర్పించిన అర్జీలను ఆన్‌లైన్‌లో నమోదు చేసి సంబంధిత శాఖల ద్వారా త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. కార్యక్రమంలో ఎంఈఓ నరేష్ కుమార్, సీడీపీఓ విజయలక్ష్మి, సూపర్వైజర్ ఆదినారాయణమ్మ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించాలని కోరారు. అధికారులు ప్రతి అర్జీని పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జూన్ 22 ( పున్నమి ప్రతినిధి)
మనుబోలు మండల రెవెన్యూ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ డేలో ప్రజల నుంచి పలు వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో జలజాక్షి, ఉప తహసీల్దార్ ప్రదీప్ కుమార్ మాట్లాడుతూ ప్రజలు సమర్పించిన అర్జీలను ఆన్‌లైన్‌లో నమోదు చేసి సంబంధిత శాఖల ద్వారా త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. కార్యక్రమంలో ఎంఈఓ నరేష్ కుమార్, సీడీపీఓ విజయలక్ష్మి, సూపర్వైజర్ ఆదినారాయణమ్మ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించాలని కోరారు. అధికారులు ప్రతి అర్జీని పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.