Saturday, 16 May 2026
  • Home  
  • ఖమ్మంలో పైలాన్ తొలగింపునకు మంత్రి తుమ్మల ఆదేశాలు..
- ఖమ్మం

ఖమ్మంలో పైలాన్ తొలగింపునకు మంత్రి తుమ్మల ఆదేశాలు..

ఖమ్మం మే (పున్నమి న్యూస్ జిల్లా ప్రతి నిధి ) ఖమ్మం పట్టణంలో ఏర్పాటు చేసిన పైలాన్‌ను తొలగించాలని రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 40 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు ఆయనపై ఉన్న అభిమానంతో ఖమ్మం పట్టణంలో ని లాకారం ట్యాంక్ బండ్ దగ్గర మాజీ ప్రధాని పీవి నరసింహ రావు విగ్రహం దగ్గర పైలాన్ ఏర్పాటు చేశారు. అయితే ప్రజలకు ఇబ్బందులు కలిగించే విధంగా ఇలాంటి కార్యక్రమాలు ఉండకూడదని మంత్రి స్పష్టం చేశారు. “నేను వ్యక్తిగత ప్రచారాలకు ఎప్పుడూ దూరంగా ఉంటాను. అభిమానంతో ఈ పైలాన్ ఏర్పాటు చేసినా, ప్రజలకు అసౌకర్యం కలిగించే పనులు చేయవద్దు” అని మంత్రి పేర్కొన్నారు. అలాగే దేశ మాజీ ప్రధాని పి. వి నరసింహ రావు తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణలు భారత దేశ అభివృద్ధికి బాటలు వేసాయని, నేటి పాలకులు కూడా ఆ సంస్కరణలనే అనుసరిస్తున్నారని మంత్రి తెలిపారు. మంత్రి ఆదేశాల మేరకు అధికారులు పైలాన్ తొలగింపు చర్యలు చేపట్టారు. ఖమ్మం నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు చూపిస్తున్న ప్రేమకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు.

ఖమ్మం మే
(పున్నమి న్యూస్ జిల్లా ప్రతి నిధి )

ఖమ్మం పట్టణంలో ఏర్పాటు చేసిన పైలాన్‌ను తొలగించాలని రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.
మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 40 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు ఆయనపై ఉన్న అభిమానంతో ఖమ్మం పట్టణంలో ని లాకారం ట్యాంక్ బండ్ దగ్గర మాజీ ప్రధాని పీవి నరసింహ రావు విగ్రహం దగ్గర పైలాన్ ఏర్పాటు చేశారు. అయితే ప్రజలకు ఇబ్బందులు కలిగించే విధంగా ఇలాంటి కార్యక్రమాలు ఉండకూడదని మంత్రి స్పష్టం చేశారు.
“నేను వ్యక్తిగత ప్రచారాలకు ఎప్పుడూ దూరంగా ఉంటాను. అభిమానంతో ఈ పైలాన్ ఏర్పాటు చేసినా, ప్రజలకు అసౌకర్యం కలిగించే పనులు చేయవద్దు” అని మంత్రి పేర్కొన్నారు.
అలాగే దేశ మాజీ ప్రధాని పి. వి నరసింహ రావు తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణలు భారత దేశ అభివృద్ధికి బాటలు వేసాయని, నేటి పాలకులు కూడా ఆ సంస్కరణలనే అనుసరిస్తున్నారని మంత్రి తెలిపారు.
మంత్రి ఆదేశాల మేరకు అధికారులు పైలాన్ తొలగింపు చర్యలు చేపట్టారు. ఖమ్మం నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు చూపిస్తున్న ప్రేమకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.